• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతికి అన్...

సంక్రాంతికి అన్ స్టాపబుల్‌ అనేది సూపర్ స్టార్‌.. రౌడీ స్టార్ ల్లో ఎవరు?

By - Tupaki Desk
Update: 2022-01-07 09:30 GMT
బాలకృష్ణ హోస్ట్‌ గా ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్న అన్ స్టాపబుల్‌ టాక్ షో సూపర్‌ హిట్ టాక్ ను దక్కించుకుని దూసుకు పోతుంది. ఈ వారం రానా తో బాలయ్య సందడి చేస్తున్నాడు. ప్రతి వారం కూడా టాలీవుడ్‌ స్టార్స్ ను రంగంలోకి దించుతున్న బాలయ్య తాజాగా విజయ్ దేవరకొండ తో ఎపిసోడ్‌ షూట్‌ పూర్తి చేశాడు. లైగర్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు బాలయ్య తో సాగించిన ఆట పాట మాటలు ఎపిసోడ్‌ ను మస్త్‌ ఎంటర్ టైన్‌మెంట్‌ తో ముంచెత్తినట్లుగా టాక్ వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ సాదారణంగానే చాలా చిల్ గా ఉంటాడు. అలాంటి రౌడీ స్టార్‌ తో బాలయ్య ఎలాంటి విషయాలు చెప్పించాడు.. బాలయ్య వద్ద రౌడీ స్టార్‌ ఏ విషయాలను మాట్లాడాడు అనేది ఆసక్తికరంగా మారింది. చాలా రోజులుగా అన్ స్టాపబుల్‌ లో విజయ్ దేవరకొండ అన్నారు.. ఎట్టకేలకు అధికారికంగా ఫొటో రిలీజ్ అవ్వడంతో క్లారిటీ వచ్చింది.

విజయ్ దేవరకొండ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తి అయ్యింది. కొన్ని వారాల ముందుగానే మహేష్ బాబు అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించారు. మహేష్ బాబు ఎపిసోడ్‌ ను అలా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఒక మంచి సందర్బం కోసం వెయిట్‌ చేస్తున్న ఆహా వారు సంక్రాంతికి ఖచ్చితంగా స్ట్రీమింగ్‌ చేస్తారనే నమ్మకంతో మహేష్‌ బాబు అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. కాని పరిస్థితి చూస్తుంటే సంక్రాంతికి విజయ్ దేవరకొండ ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే బాలయ్య గెటప్ ను చూస్తుంటే పండుగ వాతావరణం కనిపిస్తుంది. అంటే పంచె కట్టులో ఒక తెలుగు పెద్దగా బాలయ్య కనిపిస్తున్నాడు. అందుకే సంక్రాంతి స్పెషల్‌ గా విజయ్‌ దేవరకొండ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేస్తూ విజయ్‌ దేవరకొండతో టాక్ షో థీమ్‌ ను డిజైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య మరియు విజయ్ దేవరకొండల కాంబోలో అన్ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ కూడా ఖచ్చితంగా అన్‌ స్టాపబుల్‌ అన్నట్లుగా ఉంటుందనే నమ్మకంను ఓటీటీ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆహా ఓటీటీ తెలుగు వారికి చాలా దగ్గర అయ్యింది.

ఇలాంటి సమయంలో ఇద్దరు టాలీవుడ్‌ స్టార్స్ అయిన మహేష్ బాబు మరియు రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండలు అన్ స్టాపబుల్‌ లో రాబోతున్న నేపథ్యంలో మరింత గా ఆహా ప్రేక్షకులకు చేరువ అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో అన్ స్టాపబుల్‌ మొదటి సీజన్ ను ముగించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. కాని బాలయ్య అభిమానులు.. సినీ ప్రేమికులు బ్యాక్ టు బ్యాక్‌ అన్ స్టాపబుల్‌ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్‌ అవ్వాల్సిందే అంటూ కోరుకుంటున్నారు. మరి ఆహా టీమ్‌ మరియు బాలయ్య నిర్ణయం ఏంటీ అనేది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.


Tags:    
  • Balakrishna 
  • AHA 
  • unstoppable With NBK 
  • Vijay Deverakonda 
  • Liger 

Similar News

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

బెదిరింపుల‌తో ఆందోళ‌న‌లో బాలీవుడ్ స్టార్లు.. బుల్లెట్ ప్రూఫ్‌తో హై అలెర్ట్

2026-11-02 07:05 GMT

మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?

2026-11-02 06:52 GMT

ఏడాదిలో ఇన్ని సినిమాలు చూడటం సాధ్యమేనా? 1,207 మూవీస్‌తో గిన్నిస్ రికార్డు!

2026-11-02 06:50 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

రామాయణ.. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ఎంత తేడానో తెలుసా..?

2026-11-02 06:01 GMT

Tupaki Exclusive -‘ది ట్రైటర్స్ తెలుగు’ ఎలిమినేషన్ తర్వాత హర్షవర్ధన్, శ్రీదేవి చౌదరి, ప్రగతి ఇంటర్వ్యూ

2026-11-02 05:39 GMT

Copyright @2026

Powered by Blink CMS