వస్తున్నా వచ్చేస్తున్నా: సోసోగా ఉన్న V సాంగ్!

Update: 2020-03-10 08:10 GMT
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని.. సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం 'V'. అదితి రావ్ హైదరి.. నివేద థామస్ ఈ సినిమాలో హీరోయిన్లు. మార్చ్ 25 న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పటివరకూ అయితే పెద్దగా హైప్ రాలేదు. నాని ఈ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించడం ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి.

ఈమధ్య రిలీజ్ అయిన టీజర్ కు యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే 'V' నుంచి తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. 'వస్తున్నా వచ్చేస్తున్నా' అంటూ సాగే ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటను పాడినవారు శ్రేయ ఘోశల్.. అమిత్ త్రివేది.. అనురాగ్ కులకర్ణి. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా.. చూస్తున్నా చూస్తూనే ఉన్నా ఏం చేస్తున్నా నా ధ్యాసంతా నీమీదే తెలుసా" అంటూ హీరోయిన్ తన మనసులోని భావాలు చెప్తూ ఉంటుంది. దీనికి సమాధానంగా హీరో "వస్తున్నా వచ్చేస్తున్నా" అంటూ పాడతాడు. సాహిత్యం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ట్యూన్ మాత్రం పేలవంగా ఉంది. వినగా వినగా ఇది శ్రోతలకు నచ్చే అవకాశం ఉంది కానీ మొదటి సారి వినగానే నచ్చదు.

ఈ పాట నివేద - సుధీర్ బాబు మధ్య వచ్చే ఓ సెన్సువల్ సాంగ్ అనిపిస్తోంది కానీ నాని విజువల్స్ సస్పెన్స్ పెంచుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పాట నిరాశపరిచినట్టే అనుకోవాలి. ఆలస్యం ఎందుకు.. 'వస్తున్నా వచ్చేస్తున్నా' ను చూసేయండి.
Full View
Tags:    

Similar News