యస్ అన్న కోబ్రా.. సైలెంట్ గా ఉన్న చిన్నోడు

Update: 2020-04-24 06:00 GMT
బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో సెలబ్రిటీలను ఊపేస్తోంది.  ఎవరికి నచ్చినా.. నచ్చకపోయనా ఛాలెంజ్ మాత్రం అలానే కొనసాగుతోంది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్  రాజమౌళి.. ఎన్టీఆర్.. చరణ్.. చిరంజీవి..వెంకటేష్.. కొరటాల.. సుకుమార్.. క్రిష్ ఇలా చైన్ రియాక్షన్ లాగా ముందుకు సాగుతోంది.  అయితే ఇంకా కొందరు సెలబ్రిటీలు మాత్రం ఈ ఛాలెంజ్ కు స్పందించలేదు.

ఈమధ్య సీనియర్ స్టార్ వెంకటేష్ ఈ ఛాలెంజ్ ను జూనియర్ ఎన్టీఆర్ నుంచి స్వీకరించి విజయవంతంగా పూర్తి చేశారు. ఇల్లు క్లీన్ చేశారు. ఏదో వంట చేశారు.. లాన్ మూవర్ తో గడ్డి కట్ చేశారు. కాస్త తోటపని కూడా చేశారు. ఈ విడియో పోస్ట్ చేసి 'చిన్నోడు' మహేష్ బాబు.. 'కోబ్రా' వరుణ్ తేజ్..  దర్శకుడు అనిల్ రావిపూడిని ఛాలెంజ్ చేశారు.  వరుణ్ తేజ్ 'ఛాలెంజ్ స్వీకరించాను కోబ్రా' అంటూ స్పందించాడు. అనిల్ రావిపూడి అయితే అన్నీ పనులు చేసి విజయ వంతంగా 'రియల్ మ్యాన్' అనిపించుకున్నాడు. అయితే ఇంకా మహేష్ బాబు మాత్రం ఈ ఛాలెంజ్ కు స్పందించలేదు.

ఎందుకో తెలీదు కానీ మహేష్ ఇలాంటి ఛాలెంజ్ లకు స్పందించడు.  గతంలో కూడా కొందరు సెలబ్రిటీలు మహేష్ ను ఛాలెంజ్ చేస్తే స్పందించలేదు.  ఉదాహరణకు గతంలో తమిళ స్టార్ హీరో 'ప్లాంట్ ఎ ట్రీ' ఛాలెంజ్ మహేష్ కు పాస్ ఆన్ చేస్తే మహేష్ దానిని స్వీకరించలేదు. దీంతో ఇప్పుడు ఈ 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ కు స్పందిస్తాడా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది. ఈ విషయంలో సూపర్ స్టార్  ఏం చేస్తాడా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News