వ‌రుణ్ తేజ్ పాన్ ఇండియా మేక‌ర్ అత‌నేనా?

Update: 2022-09-18 14:30 GMT
మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ మెగా  బాండింగ్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్ప‌టికే  న‌టుడిగానూ స‌క్సెస్ అయ్యాడు. వ‌రుణ్ లో ఓవ‌ర్ హైట్ చూసి  మెగాస్టార్ డాన్సులు చేయ‌గ‌ల‌డా? అని సందేహ‌ప‌డిన‌ప్ప‌టికీ పెద‌నాన్న‌ భ‌యాన్ని అన‌తి కాలంలోనే పొగొట్టాడు. న‌టుడిగా..మంచి డాన్స‌ర్ గా పేరు సంపాదించాడు.

ఇక కంటెంట్ ప‌రంగా మెగా హీరోలంద‌రికంటే భిన్నంగా ఎంపిక‌ చేసుకుని ముందుకు సాగుతున్నాడు. ఓ వైపు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఇన్నోవేటివ్ గానూ వెళ్ల‌డం వ‌రుణ్ లో యూనిక్ క్వాలిటీగా చెప్పొచ్చు. మెగా కాపౌండ్ నుంచి చాలా మంది హీరోలున్నారు. కానీ వాళ్లంద‌రికంటే  వ‌రుణ్ లో క‌నిపించే రేర్ క్వాలిటి ఇది.

త‌న‌లో ఆ వే ఆఫ్ థింకింగ్ నే మెగా హీరోల నుంచి వ‌రుణ్ ని   వేరు చేస్తుంద‌ని చెప్పొచ్చు. `కంచె`..` అంత‌రిక్షం` లాంటి సినిమాలు చేయాలంటే ఎంతో ధైర్య కావాలి. అవ‌న్నీ త‌న‌లో ఉన్నాయ‌ని కెరీర్ ఆరంభంలోనే ప్రూవ్ చేసాడు. తెలుగు మార్కెట్ ప‌రంగా వ‌రుణ్ ఇమేజ్ తిరుగులేదిప్పుడు. అందుకే మెగా హీరో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

నిన్న‌టి రోజున వ‌రుణ్ త‌న 13వ చిత్రాన్ని కూడా ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. దీన్ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. `ఆకాశాన్నే తాకేందుకు` అంటూ సినిమా లైన్ గురించి హింట్ ఇచ్చేసాడు. ఎంతో ఆస‌క్తిగా స్ర్కిప్ట్ చ‌ద‌వ‌డం..చివ‌ర్లో ఆ స్ర్కిప్ట్ పై ఎయిర్ క్రాప్ట్ బొమ్మ‌ని ఉంచ‌డం . ఆస‌మ‌యంలో టేకాఫ్ శ‌బ్ధాలు వినిపించ‌డం వంటివి  ప్ర‌చార చిత్రంలో క‌నిపించాయి.

దీంతో ఈ కథ‌ యుద్ధ నేప‌థ్యంలో సాగే సినిమాగా తెలుస్తోంది. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిస్తున్న‌ట్లు లీకుందుతున్నాయి. ఈ నేప‌థ్యం లో వ‌రుణ్ పాన్ ఇండియా సినిమాని  యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థ‌తోనే ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈసినిమాకి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు ఎవ‌రు తీసుకుటున్నారు? అన్న‌ది ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు.

కేవలం స్టోరీ లైన్ మాత్ర‌మే రివీల్ చేసారు. దీంతో ఈ పాన్ ఇండియా సినిమాకి కొత్త వాళ్లే ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని సోర్సెస్ చెబుతున్నాయి. గ‌తంలో అంత‌రిక్షం సినిమాకి సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహించాడు. టాలీవుడ్ కి కొత్త ట్రెండ్ ని ప‌రిచ‌యం చేసింది అత‌నే. అంత‌కు ముందు స‌ముద్ర గ‌ర్భం నేప‌థ్యంలో సాగే  `ఘాజీ` చిత్రాన్ని కూడా సంక‌ల్ప్ నే తెర‌కెక్కించారు.

ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అంత‌రిక్షం విమ‌ర్శ‌కులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఈ నేప‌థ్యంలో  వ‌రుణ్ తో ఛాన్స్ తీసుకోవ‌డానికి అత‌నికే సాధ్య‌మ‌వుతుంది? అన్న వార్త బ‌లంగా  వినిపిస్తుంది.  ఇప్ప‌టికే సంక‌ల్ప్   వ‌ద్ద ఇలాంటి క‌థ‌లు చాలానే ఉన్నాయని పలు సంద‌ర్భాల్లో రివీల్ చేసారు.  మ‌రి వ‌రుణ్ దర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది 19వ తేదీని క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News