1800 సీసీ అదిరిపోయే హార్స్ ప‌వ‌రున్న కుర్రోడు!

Update: 2021-12-30 05:30 GMT
1800 సీసీ స్పీడ్ .. అదిరే హార్స్ ప‌వ‌రున్న బైక్ పై మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఎంత ఠీవిగా ఫోజిచ్చాడో చూశారు క‌దా! బండికి త‌గ్గ బాక్స‌ర్ తగిలాడు! అంటూ పొగిడేయాల్సిందే. అస‌లే బాక్సింగ్ నేప‌థ్యంలోని క‌థాంశం ఉన్న సినిమాలో న‌టిస్తున్నాడు వ‌రుణ్ తేజ్.

ఈ ఫోటోకి వ‌రుణ్ తేజ్ క్యాప్ష‌న్ ఇంట్రెస్టింగ్.. నీడ్ ఏ రైడ్?  ఐ నో మెనీ పీపుల్ హూ నీడ్ ద‌ట్ రైడ్! అంటూ హ్యార్లీ డేవిడ్ స‌న్ బైక్ పై టెంప్ట్ చేస్తున్నాడు. అన్న‌ట్టు వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న గ‌ని త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. పోస్ట‌ర్లు టీజ‌ర్ల‌తో క్యూరియాసిటీని పెంచాడు. మునుముందు పూర్తి ట్రైల‌ర్ పూన‌కాలు పుట్టించ‌డం ఖాయం.

చినుగుల డెనిమ్స్ .. బ్లాక్ బ‌నియ‌న్ ధ‌రించి అలా కండ‌బ‌లం ప్ర‌ద‌ర్శిస్తున్న మ్యాన్లీ హీరో వ‌రుణ్ తేజ్ లుక్ సంథింగ్ హాట్ అంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. టాలీవుడ్ హృతిక్ లా వ‌రుణ్ హైట్ వెయిట్ కి ఆ బైక్ అలా వంద‌శాతం యాప్ట్ అయ్యింది. బండికి త‌గ్గ బాక్స‌ర్ తగిలాడు! అని పొగిడేస్తున్నారు యూత్. అన్న‌ట్టు ఇలాంటి బైక్ పై రైడ్ కి ఛాన్సొస్తే ఎవ‌రైనా వ‌దులుకోగ‌ల‌రా? 
Tags:    

Similar News