మాన్ స్ట‌ర్ కజిన్ బ్ర‌ద‌ర్ బీస్ట్ లా క‌నిపిస్తున్నాడు!

Update: 2021-07-05 10:51 GMT
మాన్ స్ట‌ర్ వ‌చ్చి మీద ప‌డ్డ‌ట్టుగా.. టిప్ప‌ర్ లారీ ఎల్లి ఆటోని గుద్దిన‌ట్టుగా.. ఇంకేదో సంకేతం ఇస్తున్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. అత‌డి రూపం మొత్తం షాకింగ్ గా మారిపోయింది. వ‌రుణ్‌ భీక‌రాకారుడిని త‌ల‌పిస్తున్నాడు. ఇంత‌కుముందు బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ - రానా ఎంత‌గా హార్డ్ వ‌ర్క్ చేసి లుక్ మార్చుకున్నారో అంతే ఇదిగా ఇప్పుడు వ‌రుణ్ తేజ్ కూడా లుక్ మార్చుకుని క‌నిపిస్తున్నాడు.

ఇదంతా ప్ర‌స్తుతం న‌టిస్తున్న బాక్సింగ్ నేప‌థ్య చిత్రం `గ‌ని` కోస‌మే. మెగా ఫ్యామిలీ లో యూనిక్ స్టైల్ తో అత్యంత‌ వేగంగా ఎదిగిన స్టార్ మెగా ప్రిన్స్  ఎక్స్ క్లూజివ్ స్క్రిప్ట్ సెలెక్ష‌న్ తో ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగ‌లిగాడు. ఫ్యామిలీ హీరోల‌తో పోలిస్తే వ‌రుణ్ రేంజు వేరు అని ప్రూవైంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో త‌న‌కంటూ ఒక స్థాయి ఉంద‌ని వ‌రుణ్ నిరూపించాడు.

తాజాగా గ‌ని చిత్రంతో మ‌రో లెవ‌ల్ చూపించాల‌ని అనుకుంటున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. జిమ్ లో నిరంత‌రం శ్ర‌మిస్తూ త‌న లుక్ ని అమాంతం మార్చేసిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇక కిరణ్ కొర్ర‌పాటి వ‌రుణ్ ని అంతే ఛాలెంజింగ్ చూపించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

అలాగే  అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్-3 సినిమాలోనూ వ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఎఫ్ 2కి సీక్వెల్ క‌థ కాకుండా ఇది మ‌రింత కొత్త‌గా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే కొంత భాగం పూర్త‌యింది. ఇత‌ర షెడ్యూళ్ల‌ను అనీల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. ఎఫ్-3 త‌ర్వాత వ‌రుణ్ తేజ్ నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్  నిర్మాణ సంస్థ‌లో ఓ సినిమా చేయ‌డానికి అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఇటీవ‌ల వ‌రుణ్ పారితోషికం కూడా పెంచేశాడ‌న్న టాక్ వినిపిస్తోంది.  లాభాల్లో వాటాను ప్ర‌పోజ్ చేస్తున్నార‌ని గుస‌గుస వేడెక్కిస్తోంది. వ‌రుణ్ త‌న స్థాయికి త‌గ్గ‌ట్టే మార్కెట్లో బ్రాండ్ విలువ‌ను కాపాడుకునేందుకు త‌న లుక్ ని అమాంతం మార్చేస్తున్నాడు.. ప్ర‌స్తుతం బాక్సింగ్ నేప‌థ్యంలో గ‌ని మూవీ చేస్తున్న వ‌రుణ్ త‌దుప‌రి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయ‌నున్నాడు. వీట‌న్నిటి కోసం జిమ్ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో క‌ఠోర శిక్ష‌ణ పొందుతున్నాడు. వ‌రుణ్ జిమ్ చేస్తున్న తాజా ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి.
Tags:    

Similar News