వైరల్ వీడియో: 'గని'గా మెగాహీరో కష్టం..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్.. స్టోరీ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే వరుణ్ తన సినీలైఫ్ ఒక దారిలో సెట్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ముకుంద సినిమాతో డెబ్యూ చేసిన వరుణ్.. ఆ తర్వాత కంచె సినిమాతో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాలో వరుణ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఎంత మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా సినిమాలు, నటన పరంగా ఫెయిల్ అయితే ఎవరూ ఏమి చేయలేరు. అందుకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటున్నాడు వరుణ్.
ప్రతి సినిమా విషయంలో వేరియేషన్స్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ చేస్తున్న కొత్త చిత్రం గని. ఆల్రెడీ టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల చేసి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీతో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇదివరకు వరుణ్ నటించిన అంతరిక్షం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్.. ఆ మూవీ టైంలోనే ఈ బాక్సింగ్ స్టోరీ చెప్పి ఓకే చేసుకున్నట్లు సమాచారం. ఇక బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్టోరీ కాబట్టి వరుణ్ ఇప్పటికే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు.
వరుణ్ అన్నివిధాలా అంటే శారీరకంగా బాక్సర్ గా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని మోషన్ పోస్టర్ తో పాటే లేటెస్ట్ వీడియోలో చూసి కూడా అర్ధం చేసుకోవచ్చు. తాజాగా వీడియోలో వరుణ్ చాలా కఠోరదీక్షతో వర్కౌట్ చేస్తున్నాడు. తనతో పాటు ట్రైనర్స్ కూడా ఉన్నారు. ఈ చిత్రానికి సల్మాన్ తో సుల్తాన్ సినిమాకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారు. అది మాత్రమే కాకుండా సినిమాలో ఉపేంద్ర - సునీల్ శెట్టి లాంటి బిగ్ స్టార్స్ నటిస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక ఈ సినిమాను అల్లు బాబీ, ముద్ద సిద్ధులు నిర్మిస్తున్నారు. వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయిమంజ్రేకర్ హీరోయిన్ గా డెబ్యూ చేస్తోంది.
Full View