అబ్బబ్బే.. వరుణ్ తేజ్ అలాంటోడు కాదు

Update: 2021-05-14 12:30 GMT
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అంశం ఏమిటి అంటే..వరుణ్ తేజ్ తన తాజా చిత్రం విషయంలో వేలు పెట్టేస్తున్నారని, డైరక్టర్ ని ఇబ్బంది పెట్టేస్తున్నారని. ఇంతకీ ఏమిటా సినిమా , ఎవరా డైరక్టర్ అంటే...సినిమా పేరు ఘని, దర్శకుడు పేరు కిరణ్ కొర్రపాటి. ఫిల్మ్ సర్కిల్స్  లో ప్రచారం అవుతున్న దాన్ని బట్టి వరుణ్ తేజ ప్రవర్తనకు...దర్శకుడు చాలా అప్ సెట్ అయ్యారట.

కొత్త దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం ఘని. వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ, సిద్దు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభం నుండి రకరకాల సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు వినపడేదాని ప్రకారం అల్లు బాబీ మరియు సిద్దు మంచి స్నేహితులు అయినప్పటికీ, ఈ సినిమా నిర్మాణ విషయంలో వారి మధ్య చాలా విబేధాలు వచ్చినట్లు వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే కథతో హీరో పూర్తిగా  హ్యాపీగా లేడని స్క్రిప్టులో కొన్ని మార్పులను సూచించాడని తెలుస్తుంది. అటు ప్రొడ్యూసర్స్, ఇటు హీరో తో విసిగిపోయి..ఈ పరిస్థితుల్లో నేను సినిమా చేయలేనని దర్శకుడు చెప్పినట్టు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం రూ .50 లక్షల విలువైన సెట్‌ను నిర్మించారని, అయితే నిర్మాతల మధ్య విభేదాల కారణంగా అక్కడ షూటింగ్ కూడా చేయకుండా కూల్చివేసినట్టు తెలుస్తుంది.

అయితే ఇదే విషయమై డైరక్టర్ కిరణ్‌ను ప్రశ్నించగా, అవన్నీ రూమర్స్ అని, అబద్ధాలనే ఖండించారు. హీరో చేతికి నొప్పి ఉన్నందున షూట్ ఆపుచేసామని వివరించారు. అంతేకాకండా మొత్తం షూట్ ఆలస్యం కావడానికి కోవిడ్, విదేశీ ఫైట్ మాస్టర్స్ లేకపోవడమేనని చెప్పారు. అయితే హీరోతో ఎలాంటి విభేదాలు లేవని, చిన్న టాకీ, పెద్ద యాక్షన్ పార్ట్ తప్ప దాదాపు షూట్ పూర్తయిందని ఆయన తెలిపారు.
Tags:    

Similar News