ఇద్దరు హీరోయిన్లకు ఛాలెంజ్ విసిరిన వరుణ్

Update: 2019-10-05 12:15 GMT
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటే వృక్ష ప్రేమికులని ప్రోత్సహించడానికి వనమిత్ర అవార్డును ప్రారంభించారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన అందరికి ఈ అవార్డులను అందజేస్తామని అన్నారు. ఈ ఛాలెంజ్ స్వీకరించాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి ఫోటోలు తీసి వాటిని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

అంతేకాకుండా ఈ కార్యక్రమానికి తమన్నా, సాయి పల్లవి లను నామినేట్ చేశాడు. తనను గ్రీన్ ఛాలెంజ్ కు నామినేట్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి, అక్కినేని అఖిల్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. మంచి పని కోసం కొంచెం లేటైనా స్పందించాననీ, ఈ ఛాలెంజ్ ని సాయి పల్లవి, తమన్నాలు ఎప్పుడు స్వీకరిస్తారో చూడాలని అన్నాడు.


Tags:    

Similar News