• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా బ్రదర్ కోసం...

మెగా బ్రదర్ కోసం ప్రచారానికి కుటుంబం రెడీ!

By - Tupaki Desk
Update: 2019-03-25 13:43 GMT
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఒకవైపు నామినేషన్ల పర్వం ముగిసింది.   మరోవైపు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.  అన్ని పార్టీలవారు సినీ గ్లామర్ ను వాడుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ అద్యక్షుడుగా ఉన్న జనసేనకు మాత్రం ఎందుకో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు దూరంగానే ఉంటున్నారు.  ఇక మెగా ఫ్యామిలీలో ఉన్న ఎంతమంది హీరోలు పవన్ కోసం ప్రచారం చేస్తారన్నది కూడా తెలియదు.  దాదాపు హీరోలందరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.  సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపడం వరకూ సరేగానీ ప్రత్యక్షంగా నియోజకవర్గాలలో తిరుగుతూ ఎంతమంది ప్రచారానికి వస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే పవన్ అన్నయ్య నాగబాబు కొద్దిరోజుల క్రితం జన సేన లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.  నాగబాబు జనసేన తరఫున నరసాపురం ఎంపీ స్థానానికి పోటీపడుతున్నారు.  మరి నాగబాబు తరఫున తనయుడు వరుణ్ తేజ్.. తనయురాలు నిహారిక ప్రచారం చేస్తారా అనేది ఇప్పుడొక ఒక హాట్ టాపిక్ గా మారింది.  తాజా సమాచారం మేరకు వారిద్దరూ ప్రచారానికి సిద్దం అవుతున్నారట.  నిహారిక ప్రస్తుతం తన తాజా చిత్రం 'సూర్యకాంతం' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.  మార్చ్ 29 న రిలీజ్ కాబట్టి ఆ తర్వాత ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అవుతోందట.  

వరుణ్ తేజ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు.  ఈ వారంలోనే వరుణ్ ఇండియాకు తిరిగి వస్తున్నాడట.  ఇక్కడికి రాగానే మూడు రోజుల పాటు నాన్నగారి తరఫున వరుణ్ ప్రచారం చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట.  ఈ ప్రచారంలో నాగబాబు సతీమణి పద్మజగారు కూడా పాల్గొంటారని సమాచారం.  గోదావరి జిల్లాలలో మెగా అభిమానుల సంఖ్య కాస్త ఎక్కువే కాబట్టి ప్రచారం సమయంలో ఫుల్ హంగామా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.  
    

Tags:    
  • Varun Tej 
  • Niharika Konidela 
  • Nagababu 

Similar News

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

Copyright @2026

Powered by Blink CMS