మంచి వారికి.. చెడ్డ వారికి అందరికి కృతజ్ఞతలు

Update: 2020-01-25 14:08 GMT
హీరోయిన్‌ గా వరుస చిత్రాలు చేస్తున్న సమయంలో లేడీ విలన్‌ పాత్రను చేయమంటే ఎవరైనా ఆలోచిస్తారు.. ఎక్కువ శాతం మంది నో చెప్తారు. ఒక్కరు ఇద్దరు మాత్రమే సాహసంగా ముందడుగు వేస్తారు. ఆ ఒక్కరు ఇద్దరు ముద్దుగుమ్మల్లో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్‌ గా స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తున్న సమయంలో ఆమె విజయ్‌ సర్కార్‌ చిత్రంలో లేడీ విలన్‌ పాత్రను పోషించిన విషయం తెల్సిందే. అంతకు ముందు ఆ తర్వాత కూడా ఆమె చాలా ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించి హీరోయిన్‌ గానే కాకుండా నటిగా తనను తాను నిరూపించుకుంది.

వరలక్ష్మి సినీ కెరీర్‌ లో 25 చిత్రాల మైలు రాయిని క్రాస్‌ చేసింది. 2012లో పోడాపోడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుంటూ కేవలం స్కిన్‌ షో కు మాత్రమే పరిమితం కాకుండా 25 చిత్రాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఆమె ఎన్నో విమర్శలు.. ప్రశంసలు దక్కించుకుంది. తన ఈ జర్నీలో అండగా నిలిచినన స్నేహితులు మరియు అభిమానులకు ఆమె ఒక బహిరంగ లేఖ రాసింది.

ఆ లేఖలో.. ఈ ఎనిమిది సంవత్సరాల ప్రయాణంలో నాతో ఉన్న స్నేహితులు.. అభిమానులకు కృతజ్ఞతలు. నేను కెరీర్‌ లో ఎదుగుతున్న సమయంలో కొందరు నాపై విమర్శలు చేశారు.. నన్ను తిట్టారు.. నా ఆత్మవిశ్వాసం దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. వారందరికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే వారు అలా చేయడం వల్లే నేను మానసికంగా చాలా బలంగా తయారు అయ్యాను. గతంతో పోల్చితే ఇప్పుడు నేను చాలా మానసిక బలవంతురాలిని అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చింది. మంచి పాత్ర అనిపిస్తే చాలు ఏ సినిమాలో అయినా ఏ నటుడితో అయినా నటించేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ వరలక్ష్మి ప్రకటించింది.
Tags:    

Similar News