ఫస్ట్ లుక్ రాకముందే 'వాలిమై' రికార్డులు..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల అభిమానులు తలచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. అంటే ఇండస్ట్రీ రికార్డులు పరంగా అయితే అసలు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రతి హీరోకి సోషల్ మీడియా కావచ్చు.. అటు ఇండస్ట్రీలో మూవీ రికార్డులు కావచ్చు అలా సెట్ చేసుకున్నారు. నిజానికి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత రికార్డులు క్రియేట్ చేయడం గురించి విన్నాం. కానీ సినిమా రిలీజ్ ముందే ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ రాకుండానే సెన్సేషన్ క్రియేట్ చేయడమనేది ఖచ్చితంగా రికార్డుగానే భావించాలి. ఇలాంటి రికార్డులు ఇండస్ట్రీలో అరుదుగా జరుగుతుంటాయి. అదికూడా ఊహించిన సినిమాలకు కాదు.
మాములుగా రికార్డులు కొడతాయని తెలుసు. కానీ కనీసం ఫస్ట్ లుక్ రిలీజ్ కాకుండా అనేది తమిళ స్టార్ హీరో తలా అజిత్ సినిమాకే దక్కింది. ప్రస్తుతం అజిత్ హెచ్.వినోద్ దర్శకత్వంలో వాలిమై అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో గాని అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఛాన్స్ దొరికితే రచ్చ చేసేస్తున్నారు. గతేడాది కాలంగా వాలిమై చిత్రం నుండి ఎలాంటి అప్డేట్స్ లేవు. అలాగని మేకర్స్ కూడా ఫలానా రోజు అప్డేట్స్ ఇస్తామని కూడా చెప్పకపోవడం గమనార్హం. ఇక లాభం లేదని అజిత్ అభిమానులు ఓ రేంజిలో అప్డేట్స్ కావాలని ప్రపోసల్స్ తీసుకెళ్తున్నారు. ఇటీవలే విదేశాల్లో క్రికెట్ గ్రౌండ్ కూడా వాలిమై అప్డేట్ కావాలంటూ డిమాండ్ చేశారు.
అంటే అదంతా అభిమానమే. ఎంతలా ఎదురు చూస్తే ఫ్యాన్స్ అలాంటి నిర్ణయం తీసుకుంటారు. స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ నిర్మిస్తున్న ఈ త్రిభాషా చిత్రం తెలుగు తమిళ హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీ తాజాగా బాహుబలి రికార్డు బ్రేక్ చేసింది. అదెలా అంటే.. బుక్ మై షో ఇంటరెస్ట్ లో వాలిమై సినిమా 1మిలియన్ రికార్డు దాటింది. ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ లేకుండా సినిమా ఈ రేంజిలో ఇంటరెస్ట్ నమోదు చేయడం విశేషం. ఇదివరకు తెలుగులో బాహుబలి 2 మూవీ పేరిట ఈ రికార్డు ఉంది. కానీ ఇప్పుడు పోస్టర్ లేకుండా అజిత్ బ్రేక్ చేయడం మాములు విషయం కాదు. మరి ఈ సినిమా రిలీజ్ టైం వస్తే ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో..!