#వేలంటైన్స్ డే స్పెష‌ల్.. టాప్ 10 రొమాంటిక్ సినిమాలివే

Update: 2021-02-14 17:30 GMT
ప్రేమికులు పదే ప‌దే ఇష్ట‌ప‌డే సినిమాల్లో రొమాంటిక్ ల‌వ్ స్టోరీల‌తో తెర‌కెక్కిన జాబితా ప‌రిశీలిస్తే.. ప్రేమించి పెళ్లాడుతా (దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే).. గీతాంజ‌లి.. నిన్నే పెళ్లాడుతా .. ప్రేమ దేశం .. ఇవ‌న్నీ అప్ప‌ట్లో సంచ‌ల‌నాలు. ప్రేమికులు సెల‌బ్రేష‌న్ చేసుకునే అరుదైన చిత్రాలివి.

ఈ సినిమాల‌తో పాటు `ప్రేమికుల రోజు` పేరుతోనే అప్ప‌ట్లో ఖునాల్ హీరోగా సినిమా వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత తమిళ ద‌ర్శ‌కుడు క‌దిర్ తెర‌కెక్కించిన ఈ సినిమా అప్ప‌ట్లో ప్రేమికుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప‌ర్ఫెక్ట్ వేలెంటైన్స్ గిఫ్ట్ అని ప్ర‌శంసలు అందుకున్న సినిమాలు.. ల‌వ్ రొమాన్స్ కాన్సెప్టుల‌తో గొప్ప‌గా హృద‌యాల్ని ట‌చ్ చేసిన సినిమాలుగా ఇవ‌న్నీ చ‌రిత్ర‌లో నిలిచిపోయాయి.

ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్- తొలి ప్రేమ‌.. నాగ‌చైత‌న్య- స‌మంత జంట‌‌ ఏమాయ చేశావే.. వ‌రుణ్ తేజ్ - సాయిప‌ల్ల‌వి ల‌ ఫిదా
అల్లు అర్జున్ ఆర్య .. శ‌ర్వానంద్- నిత్యామీన‌న్ జోడీ `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు`.. ఉద‌య్ కిర‌ణ్ - రీమాసేన్ మనశాంతా నువ్వే.. ఇవ‌న్నీ చ‌క్క‌ని ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీస్ తో ఆక‌ట్టుకున్నాయి.

ఇవ‌న్నీ ప్రేమ‌కోసం త‌పించే యువ‌త‌రం క‌థాంశాల‌తో మ‌న‌సుల‌ను హ‌త్తుకున్న సినిమాలు. ల‌వ్ .. రొమాన్స్ .. ఎమోష‌న్ ప్ర‌ధానాంశాలుగా తెర‌కెక్కి ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేశాయి. అలాగే తెలుగు సినిమాల్లో మెజారిటీ భాగం ప్రేమ క‌థ‌లు సుఖాంత‌మ‌య్యేవిగా ఉంటాయి. ఇక కోలీవుడ్ చిత్రం ప్రేమిస్తే .. శాడ్ ఎండింగ్ తో వ‌చ్చి కూడా ఆక‌ట్టుకుంది. భ‌ర‌త్- సంధ్య జంట‌గా న‌టించిన ఈ చిత్రం తెలుగులోనూ ఘ‌న‌విజ‌యం సాధించింది. తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న అరుదైన ప్రేమ‌క‌థా చిత్రాలుగా ఇవ‌న్నీ రికార్డుల్లో ప‌దిలంగా ఉన్నాయి.


Tags:    

Similar News