‘కపుల్ ఫ్రెండ్లీ’ వారణాసి మ్యాజిక్.. క్లిక్కయ్యేలా ఉందే..
పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ఇలాంటి క్యారెక్టర్‌లో మానస వారణాసి ఒదిగిపోయిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది.;
టాలీవుడ్‌లో హీరోయిన్ అనగానే గ్లామర్, సాంగ్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్ గుర్తొస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆడియన్స్ టేస్ట్ మారుతోంది. కేవలం లుక్స్‌తోనే కాకుండా నటనతో మెప్పించే అమ్మాయిల కోసం వెతుకుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్‌లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మానస వారణాసి' ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈరోజు ప్రేమికుల రోజు కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, ఒక క్లాసిక్ లవ్ స్టోరీలా ఫీల్ ఇస్తోంది.
యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ నటన గురించి మనందరికీ తెలిసిందే. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ప్రధానంగా మాట్లాడుకుంటున్న పేరు మానస వారణాసి. సాధారణంగా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అంటే చాలా గ్లామరస్‌గా, మోడ్రన్ గా ఉంటుందని అందరూ ఊహిస్తారు. కానీ మానస మాత్రం ఈ సినిమాలో కంప్లీట్ నేచురల్ లుక్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది.
పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ఇలాంటి క్యారెక్టర్‌లో మానస వారణాసి ఒదిగిపోయిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. ఎక్కడా అతి లేని నటన, చాలా సెటిల్డ్‌గా హావభావాలు పలికించడం ఈమెకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. కేవలం ఈవెంట్లలో హడావుడి చేసే హీరోయిన్ల కంటే, స్క్రీన్ మీద ప్రాణం పోసే నటీమణులు కావాలనుకునే వారికి మానస ఒక బెస్ట్ ఆప్షన్ లా కనిపిస్తోంది. టాలీవుడ్‌కు ఒక పక్కా లోకల్ బ్యూటీ దొరికిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఒక జంట పెళ్లికి ముందు ఎదుర్కొనే మానసిక సంఘర్షణను మానస తన కళ్లతోనే పలికించింది. హారర్ థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాల మధ్య ఒక ప్రశాంతమైన ప్రేమకథను చూడాలనుకునే వారికి ఈమె నటన ఒక రిలీఫ్ లా అనిపిస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి. మేకప్ తక్కువగా ఉన్నా, తన నేచురల్ బ్యూటీతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంటోంది. ఒక సిన్సియర్ లవ్ స్టోరీకి ఉండాల్సిన వెయిట్ అంతా ఈమె తన భుజాల మీద మోసింది.
సినిమా ప్రమోషన్ల టైమ్‌లో సంతోష్ శోభన్ చెప్పినట్లుగానే, వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ కథకు వెన్నెముకలా నిలిచింది. ప్రభాస్ వంటి స్టార్ హీరో ఈ మూవీ ట్రైలర్ ను మెచ్చుకోవడానికి ఒక కారణం ఇందులోని రియలిస్టిక్ ఫీల్ కూడా అయ్యుంటుంది. కేవలం హీరోయిన్ అంటే ఒక కమర్షియల్ ఎలిమెంట్ లా కాకుండా, కథను నడిపించే ఒక ముఖ్యమైన పాత్రగా మానస తనను తాను ప్రూవ్ చేసుకుంది.
ఇక ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ మానస వారణాసి కెరీర్‌కు గట్టి పునాది వేసేలా ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఒక నటిగా మాత్రం ఆమెకు ఫుల్ మార్కులు పడిపోయాయి. టాలీవుడ్‌లో ఇలాంటి టాలెంట్ ఉన్న హీరోయిన్లు మరిన్ని మంచి కథలతో వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. మరి అమ్మడు ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.