సెట్లో హీరోయిన్‌తో విలన్ వాగ్వాదం ఫలితం
యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న లేడీ స్పై మూవీ `ఆల్ఫా` విడుదల అంతకంతకు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే.;
యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న లేడీ స్పై మూవీ `ఆల్ఫా` విడుదల అంతకంతకు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఆలియా వర్సెస్ బాబి డియోల్ గొడవల కారణంగానే ఇది డిలే అవుతోందని కథనాలొస్తున్నాయి. ఆలియా భట్ షూటింగ్ సమయంలో సీన్ల విషయంలో తన `క్రియేటివ్ ఇన్‌పుట్స్` ఎక్కువగా ఇస్తున్నారని, అది బాబీ డియోల్ ఉన్న సీన్లలో కూడా జరుగుతోందని సమాచా సీనియర్ నటుడైన బాబీ డియోల్ మొదట్లో సర్దుకుపోయినా, ఒక దశలో ఆలియా జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఇద్దరి మధ్య కొంత ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో, నిర్మాత ఆదిత్య చోప్రా స్వయంగా జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారని, షూటింగ్ సజావుగా సాగేలా చూశారని సమాచారం.
`వార్ 2` ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, మర్దాని 3 ఫలితాల నేపథ్యంలో.. ఆల్ఫాను థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. దీనిని ఏప్రిల్ 17న థియేటర్లలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
YRF స్పై యూనివర్శ్ లో వస్తున్న మొదటి ఫిమేల్ లీడ్ మూవీ. ఇందులో ఆలియా సూపర్ హీరోగా కనిపిస్తుంది. శార్వరి వాఘ్ పాత్ర ఆకర్షిస్తుందని సమాచారం. అలాగే బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నారు. అతడి లుక్ , పాత్ర చాలా క్రూరంగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి.
తాజా వివాదంతో ఈ మూవీ గురించి దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయితే నటీనటుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు షూటింగ్ సమయంలో సహజమే అయినా, `ఆల్ఫా` వంటి భారీ బడ్జెట్ సినిమాపై ఇలాంటి వార్తలు రావడం కొంత ఆందోళన కలిగించే విషయమే. అయితే చిత్ర బృందం నుంచి దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమా...
యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న లేడీ స్పై మూవీ `ఆల్ఫా` భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మొదటి ఫిమేల్ లీడ్ స్పై చిత్రం. సల్మాన్ ఖాన్, టైగర్, షారుఖ్ ఖాన్ పఠాన్, హృతిక్ రోషన్ `వార్` సిరీస్‌ల తర్వాత ఈ సంస్థ స్పై యూనివర్స్ నుండి వస్తున్న 7వ సినిమా ఇది. ఈ యూనివర్స్‌లో కేవలం మహిళా గూఢచారులే ప్రధాన పాత్రల్లో కనిపిస్తాయి. ఈ చిత్రంలో అనిల్ కపూర్ రా (R&AW) చీఫ్‌గా కనిపించనున్నారు. శివ్ రవైల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రతి నగరం ఒక అడవి లాంటిది.. ఆ అడవిని ఏలే గూఢచారిని `ఆల్ఫా` అంటారని టీజర్‌లో ఆలియా భట్ వివరించారు. ఇద్దరు మహిళా ఏజెంట్లు కలిసి ఒక ప్రమాదకరమైన అంతర్జాతీయ మిషన్‌ను ఎలా పూర్తి చేశారనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. సుమారు రూ. 200 నుండి 250 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ యాక్షన్ చిత్రాల స్థాయిలో రూపొందుతోంది.