పవన్ సెట్స్ లో అడుగు పెట్టేది ఎప్పుడు?
స్టార్ హీరోలు ఒక్కరు ఒక్కరుగా షూటింగ్స్ కు జాయిన్ అవుతున్నారు. గత నెలలోనే పలువురు యంగ్ సీనియర్ హీరోలు షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరి కొందరు హీరోలు ఈ నెల నుండి తమ సినిమాలను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ సినిమా గత నెలలోనే షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. కాని ఇప్పటి వరకు పవన్ సెట్స్ పైకి వెళ్లింది లేదు. ప్రస్తుతం పవన్ లేని సీన్స్ ను షూట్ చేస్తున్నారు. త్వరలోనే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో పవన్ జాయిన్ కాబోతున్నట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే పవన్ లేకుండా చేయాల్సిన సీన్స్ దాదాపుగా అన్ని పూర్తి అయ్యాయి. ఆయన జాయిన్ అయి తర్వాత మిగిలిన షూటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 26 నుండి వచ్చే నెల చివరి వరకు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే పవన్ ఈ సినిమా షూటింగ్ ను చేయబోతున్నాడు. ఇప్పటికే కోర్టు సీన్ లు పూర్తి అయిన నేపథ్యంలో శృతి హాసన్ తో కొన్ని సీన్స్ మరియు ఒక పాట ఉంటుందని ఆ తర్వాత ఒక యాక్షన్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించాల్సి ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అయిన 'పింక్' కు ఇది రీమేక్ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి సినిమాను దర్వకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి సినిమా వస్తుందంటూ ప్రకటించారు.