వకీల్‌ సాబ్‌ నుండి మరోటి.. ఫ్యాన్స్‌ నో హ్యాపీ

Update: 2020-11-14 05:42 GMT
పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఈ దీపావళికి చాలా ఆశించారు. వకీల్‌ సాబ్‌ సినిమా నుండి టీజర్‌ ఖచ్చితంగా వస్తుందని ఎదురు చూశారు. కాని సంక్రాంతికి సినిమా విడుదల విషయమై స్పష్టత లేని కారణంగా ఇప్పటి నుండే టీజర్‌ ను విడుదల చేయడం కరెక్ట్‌ కాదని యూనిట్‌ సభ్యులు భావించినట్లుగా తెలుస్తోంది. ఆ కారణంగానే అభిమానులను నిరాశ పర్చారు. ఈసారి కూడా మరో పోస్టర్‌ తో అభిమానులకు దీపావళి కానుక ఇస్తున్నారు. ఇప్పటికే వకీల్‌ సాబ్‌ పోస్టర్‌ లు వచ్చాయి. మళ్లీ ఒక పోస్టర్‌ రావడంపై ఫ్యాన్స్‌ సంతృప్తిగా లేరు అనిపిస్తుంది.

వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావాలని మేకర్స్‌ కూడా భావిస్తున్నారు. కాని కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఉన్నాయి. వాటి ఓపెన్‌ కు అనుమతులు వచ్చినా కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. థియేటర్ల యాజమాన్యాలు రీ ఓపెన్‌ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. సంక్రాంతి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదంటే మార్పు వస్తుందా అనేది అర్థం కావడం లేదు. అందుకే వకీల్‌ సాబ్‌ ను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నా థియేటర్ల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు.
Tags:    

Similar News