సెన్సార్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన సినిమా వకీల్ సాబ్. భారీ అంచనాలతో ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో పవన్ మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే పవన్ అభిమానులు ఓ రేంజిలో సినిమా ట్రైలర్ ఊపేస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లతో ఆసక్తిరేపిన ఈ సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా రికార్డు బ్రేకింగ్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పటికి ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. వకీల్ సాబ్ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.
ఈ విషయాన్నీ తాజాగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెన్సార్ కార్యక్రమం పూర్తికావడంతో వకీల్ సాబ్ అన్నివిధాలా విడుదలకు సిద్ధమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం సినీబృందంతో పాటు నటినటులు సినిమా ప్రీ-రిలీజ్ పనుల్లో, ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు, బోణికపూర్ నిర్మించారు. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా.. పాటలు, బాక్గ్రౌండ్ మ్యూజిక్ వకీల్ సాబ్ పై మరింత హైప్ క్రియేట్ చేసాయి. చూడాలి మరి వకీల్ సాబ్ విడుదలయ్యాక ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో!