దసరాకు 'వకీల్‌ సాబ్‌' క్లారిటీ

Update: 2020-10-11 12:00 GMT
పవర్‌ స్టార్‌ మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వకీల్‌ సాబ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా షూటింగ్‌ చివరి షెడ్యూల్‌ లో పవన్‌ అతి త్వరలో పాల్గొనే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్‌ రాజు భావిస్తున్నాడట. టాలీవుడ్‌ నుండి లాక్‌ డౌన్‌ తర్వాత రాబోతున్న మొదటి స్టార్‌ హీరో సినిమా వకీల్‌ సాబ్‌ అవ్వబోతుంది అంటున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా మీడియా సర్కిల్స్‌ లో వార్తలు వస్తున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ విడుదల చేయాలనుకున్న రోజునే కేజీఎఫ్ 2 సినిమా కూడా విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రెండు సినిమాలు క్లాష్‌ అయితే బయ్యర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు నష్టాలపాలయ్యే అవకాశం ఉంది. అందుకే రెండు సినిమాల మద్య కనీసం మూడు నాలుగు రోజులకు తక్కువ కాకుండా గ్యాప్‌ తీసుకోవాలని ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దసరా కానుకగా ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కేజీఎఫ్‌ 2 మేకర్స్‌ తో చర్చించి వకీల్‌ సాబ్‌ చిత్రం విడుదల తేదీపై ఈ దసరాకు క్లారిటీ ఇచ్చేందుకు దిల్‌ రాజు టీం ఏర్పాట్లు చేస్తుందట. వకీల్‌ సాబ్‌ టీజర్‌ ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దసరా తర్వాత పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్‌ లో సినిమా షూటింగ్‌ పూర్తి చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా వకీల్‌ సాబ్‌ ను విడుదల చేసేందుకు చకచక పనులు జరిగి పోతున్నాయి.


Tags:    

Similar News