కొత్త మెగా హీరో.. మళ్లీ స్వీట్ అబద్దం

Update: 2017-02-28 18:09 GMT
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు సందడి చేస్తున్నారు. అందరూ కూడా తమ తమ మార్కెట్ పరిధిని పెంచుకుంటూ.. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్నాం అనే ఫీలింగ్ రాకుండా బాగానే కష్టపడుతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా వీళ్ళను బాగా లైక్ చేస్తున్నారులే. ఈ సమయంలో మరో కొత్త మెగా హీరో ఎంట్రీ గురించి.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చెప్పిన స్వీట్ అబద్దం చూడండి ఎలా ఉందో!!

చాన్నాళ్ల నుండి నాన్తున్న అంశం ఏంటంటే.. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరో అవతారం ఎత్తేస్తాడనే వింటున్నాం. అయితే ఆ విషయంపై స్పష్టత మాత్రం లేదు. ఇదే విషయాన్ని సాయిధరమ్ ను అడిగితే.. అబ్బే మా తమ్ముడు చదువుకుంటున్నాడు.. అప్పుడే యాక్టింగ్ ఏంటి అన్నాడు. గతంలో రామ్ చరణ్ ను ఇలాగే వరుణ్‌ తేజ్ అండ్ సాయిధరమ్ తేజ్ గురించే అడిగితే.. వాళ్ళు చిన్నోళ్ళూ.. చదువుకుంటున్నారు.. వాళ్లకి సినిమాలపై అంతగా ఆసక్తి లేదు. ఒకవేళ వస్తే మాత్రం ఎంకరేజ్ చేస్తాం అంటూ కలరింగ్ ఇచ్చాడు. చివరకు పూరి జగన్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా జాయిన్ అయిన వరుణ్‌ తేజ్.. అలాగే యాక్టింగ్ డ్యాన్సింగ్ ఫైటింగులలో శిక్షణ పొందిన సాయిధరమ్ కూడా హీరోలు అయిపోయారు. అందుకే సాయిధరమ్ తేజ్ చెప్పింది ఒక స్వీట్ అబద్దం అనేది.

ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా ఒకవేళ యాక్టింగ్ స్కూల్లో నటన గురించి చదువుకుంటున్నాడేమో అని ఫ్యాన్స్ కు ఆల్రెడీ ఒక సందేహం వచ్చేసింది. ఏదేమైనా కూడా చిరంజీవి తరువాత పవన్ కళ్యాణ్‌.. అల్లు అర్జున్.. రామ్ చరణ్‌.. సాయిధరమ్ తేజ్.. వరుణ్‌ తేజ్.. అండ్ ది లిస్ట్ కంటిన్యూస్ అనాల్సిందేనా? చూద్దాం.
Tags:    

Similar News