వినూత్నంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన 'V' టీమ్...!

Update: 2020-09-03 08:30 GMT
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'వి'. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నేచురల్ స్టార్ నాని - సుధీర్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు. నివేదా థామ‌స్‌ - అదితీరావ్ హైద‌రీ హీరోయిన్లుగా నటించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన 'V' సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డి నిర్మించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా కుదరలేదు. ఇక ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసేలా కనిపించకపోవడంతో సెప్టెంబర్ 5న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కాగా 'వి' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ మరియు రెండు వీడియో సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో 'వి' చిత్ర యూనిట్ కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. కరోనా డేస్ కు ముందు సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రమోషన్స్‌ లో భాగంగా స్టార్ హీరోలను గెస్టులుగా పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసేవారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా థియేటర్స్ బంద్ కావడం.. సినిమాలన్నీ ఓటీటీ వేదికలపై రిలీజ్ అవుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేవి లేకుండా పోయాయి. అయితే 'వి' చిత్ర యూనిట్ మాత్రం ప్రీ రిలీజ్ హంగామా చేయడానికి ప్లాన్ చేసింది.  

టెక్నాలజీని ఉపయోగించుకొని 'వి' మేకర్స్ ఆన్‌ లైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ మధ్య గెస్టులను ఆన్లైన్ లోకి తీసుకొచ్చి టీజర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేపిస్తున్నట్లే 'వి' టీమ్ ఒకడుగు ముందుకేసి ఆన్లైన్ ఈవెంట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ నివేదా థామస్ ఈ వివరాలు ప్రకటిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ''మీరు మేము సెప్టెంబర్ 4న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో కలుద్దాం.. మమ్మల్ని కలవడానికి మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో జాయిన్ అవడానికి మీకు అవకాశం ఉంది'' అని పేర్కొంది. నటీనటులు దర్శకనిర్మాతలు ఈ ఈవెంట్ లో పాల్గొంటరని.. సెప్టెంబర్ 4న సాయంత్రం 6 గంటలకు మీ స్క్రీన్‌ వేదికపై కలుద్దామని పోస్టర్ షేర్ చేసింది. మరి ఈ ఆన్లైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతుందో చూడాలి.
Tags:    

Similar News