• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ సినిమాకు కొత్త...

పవన్ సినిమాకు కొత్త టెక్నీషియన్

By - Tupaki Desk
Update: 2016-11-05 10:19 GMT
ఈ మధ్య సినిమా సినిమాకూ టెక్నీషియన్లను మార్చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు ఎక్కువగా దేవిశ్రీతో మ్యూజిక్ చేయించుకుంటూ వచ్చిన త్రివిక్రమ్.. ఛాయాగ్రహణ బాధ్యతల్ని ప్రసాద్ మూరెళ్లకు అప్పగించేవాడు. ఐతే ‘అఆ’ సినిమాకు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్.. ఇద్దరినీ మార్చేశాడు. ఆ సినిమాకు మిక్కీ జే మేయర్.. నటరాజ్ సుబ్రమణ్యం పని చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా చేయబోయే సినిమాకు కూడా కొత్త టెక్నీషియన్లు వచ్చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్నందిస్తాడన్న సంగతి పాత విషయమే. కెమెరామన్ కూడా కొత్త వాడన్న సంగతి ఈ రోజే వెల్లడైంది.

శనివారమే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా పెద్దగా హడావుడి లేకుండా రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించలేదు.  కాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్ డేట్స్ బయటికొచ్చాయి. ఈ చిత్రానికి మణికందన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. తమిళంలో.. హిందీలో మంచి పేరున్న ఈ సినిమాటోగ్రాఫర్ కు తెలుగులో ఇదే తొలి సినిమా. షారుఖ్ ఖాన్ సినిమాలు ‘రా.వన్’.. ‘ఓం శాంతి ఓం’.. ‘మై హూనా’లతో పాటు ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’.. ‘యే జవాని హై దీవాని’ లాంటి బడా బాలీవుడ్ ప్రాజెక్టులకు పని చేశాడు మణికందన్. తమిళంలోనూ కొన్ని సినిమాలకు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించాడు. త్రివిక్రమ్ అతణ్ని తెలుగులోకి తీసుకొస్తున్నాడు. మరి ఇక్కడ ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • V Manikandan 
  • Pawan 
  • Trivikram 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS