కమల్ హాసన్‌తో మణిరత్నం ఢీ అంటే ఢీ
కమల్ హాసన్‌కు నటుడిగా ఎంత పేరుందో.. మణిరత్నంకు డైరెక్టర్‌గా అంతే పేరుంది. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'నాయకుడు' టైమ్ మ్యాగజైన్ ప్రపంచ అత్యుత్తమ వంద చిత్రాల్లో ఒకటిగా ఎంపికై సంచలనం సృష్టించింది. ఐతే ఈ ఇద్దరు లెజెండ్స్ మళ్లీ జట్టు కట్టడానికి ఇష్టపడలేదు. ఇద్దరి మధ్య ఇగో ప్రాబ్లెమ్సే దీనికి కారణమని కొందరు.. ఇద్దరి మధ్య గొడవలున్నాయని ఇంకొందరు అంటుంటారు. సినిమాల విడుదలలో ఒకరితో ఒకరు పోటీ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా ఏళ్ల కిందట దళపతి, గుణ.. రెండేళ్ల కిందట విశ్వరూపం, కడలి ఒకదాంతో ఒకటి పోటీ పడ్డాయి. గుణ మీద దళపతి నెగ్గితే.. కడలి మీద విశ్వరూపం విజయం సాధించింది.
ఐతే లెజెండ్స్ ఇద్దరూ మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 10న ఇద్దరి సినిమాలు ఒకదాంతో ఒకటి పోటీ పడనున్నాయి. కమల్ నటించి, రచన కూడా చేసిన 'ఉత్తమ విలన్'ను ముందు ఏప్రిల్ 2న అనుకుని ఆ తర్వాత 10న విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. మరోవైపు మణిరత్నం సినిమా 'ఓకే కాదల్' తమిళ సంవత్సరాది ఏప్రిల్ 14న విడుదల చేద్దామనుకున్నారు కానీ.. వీకెండ్ కలెక్షన్స్ ఎందుకు మిస్సవ్వడమని ఇప్పుడు దాన్ని కూడా ఏప్రిల్ 10నే తేవడానికి నిర్ణయించారు. దీంతో మణిరత్నం, కమల్ మధ్య మళ్లీ క్లాష్ వచ్చింది. ఈసారి ఎవరైనా తగ్గుతారా.. లేక పోటీకి సై అంటారా చూడాలి. ఒకే రోజు వస్తే ఈసారి ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారన్నదీ ఆసక్తికరమే.