• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తిర‌గేసి తొడిగావ్...

తిర‌గేసి తొడిగావ్ నీకేమైనా పిచ్చా?

By - Tupaki Desk
Update: 2022-02-15 03:30 GMT
హిందీ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జాద‌వ్ ఇటీవ‌లి కాలంలో రెగ్యుల‌ర్ గా హెడ్ లైన్స్ లోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. విచిత్ర‌మైన వేష‌ధార‌ణ‌ను విల‌క్ష‌ణ‌మైన డిజైన‌ర్ దుస్తుల‌ను ఎంచుకోవ‌డం ద్వారా త‌న ఉనికిని చాటుకునేందుకు ఈ బ్యూటీ చేస్తున్న ప్ర‌య‌త్నం ఔరా! అనిపిస్తోంది.

ఇంత‌కుముందు చినుగుల డెనిమ్స్ లో క‌నిపించింది. ఆ త‌ర్వాత పేలిక‌లుగా క‌త్తిరించిన మోడ్ర‌న్ డ్రెస్ లో వేడెక్కించింది. ఇలాంటి ప్ర‌యోగాలు త‌న‌కు కొత్తేమీ కాద‌ని ఇప్పుడు కూడా మ‌రోసారి నిరూపించింది. ఉర్ఫీ చొక్కా తిర‌గేసి తొడిగింది.

హ్యాపీ వాలంటైన్స్‌ డే అంటూ ఈ ఫోటోని షేర్ చేయ‌గా నెట్టింట హాట్‌ టాపిక్ గా మారింది. చొక్కాను తిరగేసి తొడిగావు..ఇదేమి ఫోజు? అని కొంద‌రు వ్యాఖ్యానించ‌గా.. ఈ స్టైల్‌ పేరేంటో తెలుసా? ఉల్టా షర్ట్‌.. ఈమె మెదడు మోకాలిలో ఉందని ప్రూవ్డ్.. చొక్కా రివర్స్‌లో ధరిస్తే దాన్ని మోడలింగ్‌ అనరు.. పిచ్చి అంటారు అంటూ ఘాటైన ట్రోలింగ్ ఎదురైంది.

త‌న‌కు ఏది కావాలో ఆ ఔట్ పుట్ తీసుకుంది ఉర్ఫీ. సోష‌ల్ మీడియాల్లో ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. యువ‌త‌రం ఉర్ఫీ స్పెష‌ల్ లుక్ కి ఫిదా అయిపోతున్నారు.

అలా వీపందం ఒక వైపు.. ఉల్టా ష‌ర్ట్ లో మోడ్ర‌న్ స్టైల్ ఇంకో వైపు హాట్ టాపిక్ గా మారాయి. కంగ‌న హోస్ట్ గా `లాకప్‌` షో చేస్తుందని ఉర్ఫీ గురించి ఊహిస్తున్నారు అభిమానులు. కానీ అవ‌న్నీ వుట్టి పుకార్లేనని తాను ఈ షో చేయడం లేదని క్లారిటీ ఇచ్చిందీ ఈ బ్యూటీ.

ఇక సినిమాల ప‌రంగా ఇటీవ‌లి కాలంలో ఉర్ఫీ జాద‌వ్ కి చాలా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అలాగే సోష‌ల్ మీడియాలో తాను చేసిన  సింగిల్ ఆల్బ‌మ్ క్రేజీ గురించి ప్ర‌చారం చేస్తోంది. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన క్రేజీ టీజ‌ర్ వైర‌ల్ అయ్యింది.

ఇలా ప్ర‌ద‌ర్శిస్తే విమానం మోతే!

ఇటీవ‌లే ఓ విమానాశ్రయంలో చినుగుల‌ టాప్ తో బటన్ లెస్ లుక్ తో క‌నిపించి అభిమానుల్ని షేక్ చేసింది ఉర్ఫీ. చాలామంది అభిమానులు ర‌క‌ర‌కాలుగా ట్రోలింగ్ చేశారు. బిగ్ బాస్ OTT తర్వాత ఉర్ఫీ వార్తల్లో ప్ర‌ముఖంగా నిలుస్తోంది.

త‌ను  జావేద్ అక్తర్ మనవరాలు అంటూ ప్ర‌చార‌మైనా ఈటీమ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనకు ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 24 ఏళ్ల ఉర్ఫీ మొదట 2016 TV షో బడే భయ్యా కి దుల్హానియాలో కనిపించింది.

 తర్వాత మేరి దుర్గా- బెపన్నహ్ -పంచ్ బీట్ సీజన్ 2 లో వరుసగా ఆల్ట్ బాలాజీ లో కనిపించింది.  ఆమె యే రిష్ట క్యా కెహ్లాతా హై- కసౌతి జిందగీ కేలో కూడా కనిపించింది. ఉర్ఫీ బిగ్ బాస్ ఓటీటీ ఇంటి లోపల ఫన్నీ వన్-లైన్స్ తో ఎగ్జ‌యిట్ చేసింది. అయితే షోలో ఆమె భాగస్వామి జీషన్ ఖాన్ దివ్య అగర్వాల్ తో సంబంధాలు విరివిగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

Full View
Tags:    
  • Urrfii 
  • Bollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS