మెగా మేనల్లుడు ఫస్ట్ సినిమా గండం నుండి బయటపడేనా

Update: 2020-07-04 05:30 GMT
మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో హీరో  వైష్ణవ్ తేజ్. చిరంజీవి మేనల్లుడుగా సాయి ధరమ్ తేజ్ సోదరుడుగా 'ఉప్పెన' సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో కృతీ శెట్టి హీరోయిన్‌ గా టాలీవుడ్‌ కు పరిచయమవుతోంది. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక 'ఉప్పెన' సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఉప్పెన నుండి ఇప్పటికే విడుదలైన రెండు లిరికల్ పాటలు మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'నీ క‌న్ను నీలి స‌ముద్రం' అనే సాంగ్ ఈ ఏడాది సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించిన పాట‌ల్లో ఒక‌టిగా నిలిచింది. దేవిశ్రీ కూర్చిన అద్భుత‌మైన ఖ‌వ్వాలీ బాణీల‌కు జావేద్ అలీ మ‌ధుర‌మైన గాత్రంతో జీవం పోశారు. ఇక శ్రీ‌మ‌ణి - ర‌ఖీబ్ ఆల‌మ్ అందించిన సాహిత్యం ఈ పాట‌ను మ‌రింత‌ ఆకర్షణ తీసుకొచ్చింది. ఈ క్రమంలో తాజాగా 'నీ కన్ను నీలి స‌ముద్రం' పాట మ‌రో అరుదైన‌ మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్‌ లో 8 కోట్ల వ్యూస్‌ ను సొంతం చేసుకుంది.

కాగా 'ఉప్పెన' సినిమాకి క్రేజ్ రావడానికి.. ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి  'నీ కన్ను నీలి స‌ముద్రం' ఎంతో హెల్ప్ అయింది. అయితే కరోనా కారణంగా 'ఉప్పెన' కి ఈ పాట తెచ్చిన క్రేజ్ మొత్తం పోయింది. ఈ పాట తో కాస్త ఓపెనింగ్స్ తెచ్చుకుందాం అనుకున్న ఉప్పెన టీమ్ కి థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో ఇబ్బందులు వచ్చి పడ్డాయి అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలవారు. అయినా పరిస్థితులు చూస్తుంటే ఈ యూట్యూబ్ వ్యూస్.. మిలియన్స్ బిల్లియన్స్ రికార్డ్స్ ఇక ఉండకపోవచ్చు. ఏ సినిమా అయినా మళ్ళీ మొదటి నుండి ప్రమోషన్ చేసుకోవాల్సిందే. ఇదంతా పక్కన పెడితే 'ఉప్పెన' సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యే దాకా వెయిట్ చేయాలని డిసైడ్ అయిందట. అయితే ఇప్పుడు థియేటర్స్ తెరిచినా జనాలు వస్తారో రారో అనే డైలామాలో చిత్ర యూనిట్ ఉండాల్సిందే అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

కారణాలు ఏవైనా కానీ మెగా మేనల్లుళ్లు సాయి తేజ్ - వైష్ణవ్ తేజ్ కి ఫస్ట్ సినిమా గండాలు ఉన్నాయనేది ఇండస్ట్రీలో టాక్. అప్పుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ఫస్ట్ సినిమా 'రేయ్' సినిమా రిలీజ్ కి ఇబ్బందులు తలెత్తి 'పిల్లా నువ్వులేని జీవితం' మొదటి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకి కూడా రిలీజ్ కష్టాలు వచ్చి పడ్డాయి. ముందుగా ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసారు. దానికి తగ్గట్లే షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకోగా కరోనా వచ్చి ప్లాన్స్ అన్నీ తారుమారు చేసింది. మరి మెగా మేనల్లుడు వైష్ణవ్ ఫస్ట్ సినిమా గండం నుండి బయటపడతారో లేదో చూడాలని సినీ అభిమానులు వేచి చూస్తున్నారు.
Tags:    

Similar News