• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాబు వ‌చ్చేశాడు.....

బాబు వ‌చ్చేశాడు.. త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్ట‌లెక్కుతుందా?

By - Tupaki Desk
Update: 2022-10-31 09:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చిన్న విరామం ల‌భించినా ఫ్యామిలీతో క‌లిసి విదేశాల్లో విహ‌రిస్తుంటార‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. టాలీవుడ్ లో వున్న టాప్ స్టార్ల‌లో అత్య‌ధ‌కంగా ఫ్యామిలీ టూర్లు వేసే హీరోగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు. ఇటీవ‌లే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో SSMB 28ని ప్రారంభించిన మ‌హేష్ తొలి షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. ఆ త‌రువాత మ‌హేష్ మాతృమూర్తి ఇందిరా దేవి మృతితో షూట్ కి బ్రేకిచ్చిన మ‌హేష్ ఇటీవ‌ల ఫ్యామిలీతో క‌లిసి లండ‌న్ కు వెళ్లిపోయారు.

ప్ర‌త్యేక వెకేష‌న్ కోసం ఫ్యామిలీతో క‌లిసి లండ‌న్ వెళ్లిన మ‌హేఫ‌ష్ తాజాగా సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ విమానాశ్ర‌యంలో భార్య న‌మ్ర‌త‌, పిల్ల‌లు గౌత‌మ్, సితార‌ల‌తో క‌లిసి కెమెరాల‌కు చిక్కారు. డెనిమ్ క‌ల‌ర్ ప్యాంట్ లో క్యాప్, మాస్క్ ధ‌రించి సూప‌ర్ కూల్ గా క‌నిపించాడు. క్యాజువ‌ల్ డ్రెస్ లో మ‌హేష్ క‌నిపించిన తీరు ఆకట్టుకుంటోంది. వైట్ జాకెట్... సీతాకాలం ప్రారంభం కావ‌డంతో మ‌హేష్ చాలా సింపుల్ డ్రెస్ లో ఫ్యామిలీతో క‌లిసి ద‌ర్శ‌న‌మిచ్చాడు.  

ఇటీవ‌ల లండ‌న్ వీధుల్లో విహ‌రిస్తున్న ఫ్యామిలీ ఫొటోల‌ని న‌మ్ర‌త శిరోద్క‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేయ‌డం అవి నెట్టింట వైర‌ల్ కావ‌డం తెలిసిందే. అంతే కాకుండా 'లండ‌న్ ఎల్ల‌ప్పుడూ మంచి ఆలోచ‌న‌' అంటూ న‌మ్రత షేర్ చేసిన పోస్ట్ నెట్టింట మ‌రింత వైర‌ల్ గా మారింది. ఇదిలా వుంటే మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న 28వ ప్రాజెక్ట్ ని త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో చేస్తున్న విష‌యం తెలిసిందే. SSMB 28 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా ఫ‌స్ట్  షెడ్యూల్ ని పూర్తి చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ ని వ‌చ్చే ఏడాది 2023 ఏప్రిల్ 28న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈమూవీకి పీ.ఎస్ వినోద్ ఫొటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. ప్ర‌త్యేక వెకేష‌న్ కోసం ఫ్యామిలీతో క‌లిసి లండ‌న్ వెళ్లిన మ‌హేష్ సోమ‌వారం ఉద‌యం తిరిగి రావ‌డంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుందా? అనే చ‌ర్చ మొద‌లైంది. త్రివిక్ర‌మ్ స్క్రిప్ట్ ని ఓకే చేసి మ‌హేష్ షూటింగ్ కి వెళ్తాడా?  లేక వెయిట్ చేసి ఆ త‌రువాతే త‌దుప‌రి షెడ్యూల్ ని మొద‌లు పెడ‌తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

ఇదిలా వుంటే యంగ్ ప్రొడ్యూస‌ర్‌, సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ అధినేత‌ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ సోష‌ల్ మీడియా వేదిక‌గా SSMB 28పై ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.

యాక్ష‌న్ ఎక్సా గ‌వాంజాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ని త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నామ‌ని, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చాలా ఎక్సైటింగ్ అప్ డేట్ లు రానున్నాయ‌ని రానున్న రోజుల్లో రానున్నాయ‌ని వెల్ల‌డించ‌డంతో మ‌హేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌. ఇంత‌కీ ఎక్సైటింగ్ అప్ డేట్స్ ఉంట‌న్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodFilm 
  • DirectorTrivikram 
  • Maheshbabu 
  • MaheshTrivikramFilm 
  • FilmIndustry 
  • SSMB28Movie 
  • SuryaDevaraNagaVamshi 
  • PoojaHegde 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS