టైగ‌ర్ కి జోడీ వీళ్లెవ్వ‌రూ కాదంట‌? అయితే అంత‌కు మించే!

Update: 2022-08-29 09:32 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ #30 చిత్రంలో  హీరోయిన్ ఎవ‌రు అన్న‌ది? ఇంకా ఖ‌రారు కాని సంగ‌తి  తెలిసిందే.  ఈనేప‌థ్యంలో రోజుకో హీరోయిన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇప్ప‌టికే డ‌జ‌ను భామ‌ల పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.  రష్మిక మంద‌న్న‌ నుంచి మొదలు .. స‌మంత‌ జాన్వీ కపూర్‌.. దిశా పటానీ.. అనన్య పాండే పేర్లు వినిపించాయి. వీరంద‌రికంటే ముందు ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ  అలియాభ‌ట్ పేరు తెరపైకి వ‌చ్చింది.

ఆమె ఖరారైతే వీళ్ల‌వ్వ‌రూ రేసులో నిలిచే వారు  కాదు. కానీ అనూహ్యంగా  అలియా ఆ ప్రాజెక్ట్ కి ఒకే చెప్ప‌లేదు. ఆ త‌ర్వాత ఈభామ‌లంద‌రి పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. తాజాగా నేచుర‌ల్ పెర్పార్మ‌ర్ సాయి ప‌ల్ల‌వి పేరు సైతం రేసులో నిలుస్తుంది.  ఇందులో హీరోయిన్ పాత్ర‌కి ఎక్కువ స్కోప్ ఉంటుంద‌ని ఈ నేప‌థ్యంలో   ప‌ల్ల‌విని ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది.

స్టిల్ ఇంకా నెట్టింట హీరోయిన్ ప్రచారం ఠారెత్తిపోతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చేసారు. ఇంకా ఏ హీరోయిన్ ఫైనల్ చేయ‌లేద‌ని..సోష‌ల్ మీడియా జ‌రుగుతోన్న ప్ర‌చారం అంత ఫేక్ అని కొట్టి పారేసారు. దీంతో హీరోయిన్ విష‌యంలో తారక్ అభిమానుల్లో  క్యూరిసిటీ రెట్టింపు అవుతుంది. ఇంత మంది హీరోయిన్లు ఎవరూ కాదంటే?  హీరోయిన్ పాత్ర  వెయిట్ ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.

మేక‌ర్స్ దృష్టిలో వీళ్లెవ్వ‌రూ లేరంటే?  కొత్త వాళ్లు ఎవ‌రినైనా బ‌రిలోకి దించుతారా? లేక‌! అంత‌కు మించి  బాలీవుడ్ ఫేమ‌స్ భామ‌ని దిగుమ‌తి చేస్తారా? అన్న‌ది చూడాలి. ప్రస్తుతం  సినిమాకి సంబంధించి  ప్రీ ప్రొడ‌క్ష‌న్  ప‌నులు జ‌రుగుతున్నాయి. అవన్నీ దాదాపు ఓ కొలిక్కి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఇక‌పై  హీరోయిన్ ఎంపిక పై దృష్టి  సారించే అవ‌కాశం ఉంది.
Read more!

ఆర్ ఆర్ ఆర్ తో తార‌క్  పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయ్యారు. కొర‌టాల తెర‌కెక్కిస్తున్న సినిమా పాన్ ఇండియా కాన‌ప్ప‌టికీ  హీరోయిన్ రేంజ్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గే ఛాన్స్ లేదు. తార‌క్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆయ‌న రేంజ్ కి ఏమాత్రం త‌గ్గ‌ని భామ‌ని తీసుకొస్తారు.

మ‌రి ఆఛాన్స్ ఏ భామ‌ని వ‌రిస్తుంద‌న్న‌ది చూడాలి. తార‌క్-కొర‌టాల స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన 'జ‌న‌తా గ్యారేజ్' బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ కాంబినేష‌న్ పై భారీ అంచ‌నాలు నెల‌కొంటున్నాయి.  ఎన్టీఆర్ ఆర్స్ట్ బ్యాన‌ర్-యువ సుధ ఆర్స్ట్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News