• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మణిర‌త్నం డ్రీమ్...

మణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కు అక్క‌డా అదే రిజ‌ల్ట్‌?

By - Tupaki Desk
Update: 2022-11-01 02:30 GMT
ది గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం దాదాపు  30 ఏళ్ల కు పైగా త‌ర డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన‌టు వంటి 'పొన్నియిన్ సెల్వ‌న్' ని తెర‌పైకి తీసుకురావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే బ‌డ్జెట్ కార‌ణాలదృష్ట్యా ఈ మూవీని డ‌బ్బులు పెట్ట‌డానికి ఫైనాన్షియ‌ర్ లు సాహ‌సించ‌క‌పోవ‌డంతో గ‌త కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ వ‌ర్గాలు ముందుకు రావ‌డంతో మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైన‌ల్‌గా కార్య రూపం దాల్చింది.

చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జ‌యం ర‌వి, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేశారు. అయితే త‌మిళంలో మాత్ర‌మే ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబట్టింది. అక్క‌డి ప్రేక్ష‌కుల్ని మాత్ర‌మే విశేషంగా ఆక‌ట్టుకుంది. మిగ‌తా భాష‌ల‌తో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లో ఆశించిన విధంగా మేక‌ర్స్ ని ఏ విష‌యంలోనూ ఈ మూవీ సంతృప్తి ప‌రచ‌లేక‌పోయింది.

ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్ లోనూ రికార్డు స్థాయి బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగులో మాత్రం పెద్ద‌గా రాణించ‌లేక షాకిచ్చింది. కార‌ణం త‌మిళ ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే న‌చ్చిన క‌థ కావ‌డం, సినిమా అంతా త‌మిళ నేటివిటీలోనే సాగ‌డం ఈ సినిమాకు ప్ర‌ధాన మైన‌స్ గా మారింది. అదే కార‌ణంతో ఇత‌ర భాష‌ల‌కు చెందిన ప్రేక్ష‌కులు ఈ మూవీని ఓన్ చేసుకోలేక‌పోయారు. ఇదిలా వుంటే ఈ మూవీ అమె జాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

పే ప‌ర్ ప్యూ పంద్దిలో స్ట్రీమింగ్ మొద‌లైన ఈ మూవీని న‌వంబ‌ర్ 4 నుంచి వీక్ష‌కులు ఎలాంటి అద‌న‌పు ఖ‌ర్చులు లేకుండా వీక్షించే వీలుని క‌ల్పించారు. అయితే థియేట‌ర్ల‌లో ఎలాంటి ఫ‌లితాన్ని ఈ మూవీ చ‌విచూసిందో అదే ఫ‌లితాన్ని ఓటీటీలోనూ సొంతం చేసుకుని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంద‌ని తెలుస్తోంది.

థియేట‌ర్ల‌లో త‌మిళ ప్రేక్ష‌కులు ఈ మూవీని విర‌గ‌బ‌డి చూశారు. కానీ ఇత‌ర భాష‌ల‌కు చెందిన ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేదట‌. ఓటీటీలోనూ త‌మిళ ప్రేక్ష‌కులు చూడాల‌నుకుంటున్నారే కానీ ఇత‌ర భాష‌ల‌కు  చెందిన వారు ఈ మూవీపై అంత‌గాఆస‌క్తిగా లేర‌ని తెలుస్తోంది.

న‌వంబ‌ర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీ మింగ్ కానున్న ఈ సినిమా కోసం కేవ‌లం త‌మిళ ప్రేక్ష‌కులే ఎగ‌డ‌బ‌తారా?  లేక ఇత‌ర భాష‌ల వాళ్లు కూడా ఆస‌క్తిని చూపించి ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అయినా స‌రికొత్త రికార్డు ను తిర‌గ‌రాసేలా చేస్తారా అన్న‌ది వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • PonniyanSelvanMovie 
  • AishwaryaRai 
  • Trisha 
  • Maniratnam 
  • LykaProductions 
  • PS1inAmazonPrime 
  • Vikram 
  • Karthi 
  • PonniyanSelvanCollections 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS