• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బుట్టబొమ్మ కాస్త ఆలస్యం.....

బుట్టబొమ్మ కాస్త ఆలస్యం.. కారణం ఇదే!

By - Tupaki Desk
Update: 2023-01-21 13:28 GMT
అనికా సురేంద్రన్‌ హీరోయిన్‌ గా సూర్య మరియు అర్జున్‌ దాస్ లు కీలక పాత్రలో నటించిన 'బుట్టబొమ్మ' సినిమా ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ సినిమాను వారం ఆలస్యంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

పలు తమిళ డబ్బింగ్‌ సినిమాల్లో కనిపించి అనికా ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. చిన్న అమ్మాయిగా అనికా ఉన్నప్పటి నుండి తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్‌ గా ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో బుట్టబొమ్మ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

శౌరి చంద్రశేఖర్‌ టి రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌ వారు ఈ సినిమాను ఫార్చ్యూన్‌ ఫోర్‌ బ్యానర్‌ తో కలిసి నిర్మించారు. ఈ మధ్య కాలంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ వారి సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.

కంటెంట్‌ ఉన్న సినిమాలను సితార వారు తీసుకు వస్తున్నారు అనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే బుట్ట బొమ్మ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక విభిన్నమైన రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన వీడియోలను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.

జనవరి 26వ తారీకున ఈ సినిమాను విడుదల చేయాలి అనుకున్నప్పటికీ ఆ రోజు చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతటి పోటీలో రావడం సరైన నిర్ణయం కాదు అన్నట్లుగా భావించిన మేకర్స్‌ ఫిబ్రవరి 4వ తారీకున విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ తో ఒక పోస్టర్‌ ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • AnikhaSurendran 
  • TollywoodFilmIndustry 
  • ButtaBommaFilm 
  • ArjunDas 
  • ShauriChandrasekharTRamesh 
  • ButtaBommaReleaseDate 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS