లోకనాయకుడి 'విక్రమ్' అప్డేట్ వచ్చింది
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ రాజకీయాలతో బిజీ ఉన్నా సినిమా ఇండస్ట్రీని మాత్రం వదలకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈమద్య కాలంలో తమిళ ఇండస్ట్రీలో లోకేష్ కనగరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. అంతుకు ముందు ఖైదీ కూడా సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా ఈయన గురించిన వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో లోకేష్ చేస్తున్న తదుపరి సినిమా విక్రమ్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నాడు కనుక. ట్యాలెంటెడ్ దర్శకుడు మరియు సీనియర్ మోస్ట్ ది బెస్ట్ హీరో కమల్ ల కలయికలో సినిమా అంటే సహజంగానే ఆసక్తి పీక్స్ లో ఉంటుంది.
తమిళ ప్రేక్షకులతో పాటు సౌత్ ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కమల్.. లోకేష్ కనగరాజ్ ల 'విక్రమ్' మూవీ షూటింగ్ చకచక సాగుతోంది. తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను ముగించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా యూనివర్శిల్ స్టార్ 'విక్రమ్' మూవీ అప్ డేట్ ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్న అభిమానులకు మరియు మీడియా వర్గాలకు సమాధానం లభించింది. సెకండ్ షెడ్యూల్ ముగిసిన ఈ సినిమా అతి త్వరలోనే పూర్తి అవుతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. భారీ ఎత్తున అంచనాలున్న విక్రమ్ సినిమా స్టార్ కాస్టింగ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిలిపింది అనడంలో సందేహం లేదు.
దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న కమల్ హాసన్ కు తోడు ఈమద్య కాలంలో నటనలో హద్దులు దాటి ది బెస్ట్ అనిపించుకున్న ఫహద్ ఫాసిల్ మరియు విజయ్ సేతుపతిలు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ముగ్గురు నటనలో కొత్త మార్క్ లను సెట్ చేసిన వారు అనడంలో సందేహం లేదు. ముగ్గురు ఒక్క సినిమాలో కలిసి నటిస్తే అదో బిగ్ మల్టీ స్టారర్ అవుతుంది. ఇలాంటి బిగ్ మల్టీ స్టారర్ కోసం కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు మరియు మలయాళం ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెండవ షెడ్యూల్ ముగిసింది అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించిన నేపథ్యంలో షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందో అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.