• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సందీప్ వంగా తో...

సందీప్ వంగా తో డార్లింగ్..? #Prabhas25 వెనుక అసలు కథ ఇదే..?

By - Tupaki Desk
Update: 2021-10-06 10:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే బిజీగా గడుపుతున్న హీరో అని చెప్పొచ్చు. నాలుగు భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడమే కాకుండా.. అందులో ఒక సినిమా షూటింగ్ పూర్తి చేశారు.. మరో మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రభాస్ తన ల్యాండ్ మార్క్ సిల్వర్ జూబ్లీ ప్రాజెక్ట్ #Prabhas25 ని ప్రకటించడానికి రెడీ అయ్యారు.

ప్రభాస్ చేయబోయే 25వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు (అక్టోబర్ 7) గురువారం వెలువడనున్న సంగతి తెలిసిందే. టీ-సిరీస్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమాకి 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మరికొన్ని గంటల్లో మేకర్స్ నుంచి క్లారిటీ రానుంది. అయితే ఉన్నట్టుండి #Prabhas25 ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇవ్వడం వెనుక కథ వేరే ఉందని తెలుస్తోంది.

సందీప్ రెడ్డి గత కొంతకాలం ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఇంతకముందు డార్లింగ్ కు సందీప్ ఓ లైన్ చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే దీనికి హీరో సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ రాలేదట. ఈ క్రమంలో పోయిన వారం మరో కొత్త స్టొరీ లైన్ ను ప్రభాస్ కు దర్శకుడు వినిపించగా.. గ్రీన్ సిగ్నల్ వచ్చిందట.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రభాస్ కు సందీప్ పూర్తి స్క్రిప్ట్ చెప్పకముందే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది. దీంతో కథ పూర్తిగా లాక్ అవ్వకముందే ప్రాజెక్ట్ ప్రకటించాల్సి వచ్చిందని ప్రభాస్ టీమ్ కాస్త బాధపడిందని టాక్ నడుస్తోంది. తాజాగా టీ-సిరీస్ సంస్థ వారు ట్విట్టర్ వేదికగా #Prabhas25 కు సంబంధించిన హింట్ ఇచ్చారు.

''అక్టోబర్ 7న ఏదో పెద్ద విషయం రాబోతోంది'' అంటూ 25వ నంబర్ తో ఓ పోస్టర్ ని వదిలారు. ఇది ప్రభాస్ కు సంబంధించిన ప్రాజెక్ట్ అని అర్థం అవుతుంది. ప్రభాస్ తో టీ-సిరీస్ వారు పలు చిత్రాలు నిర్మించడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. 'సాహో' సినిమాతో పాటుగా జనవరి 14న రిలీజ్ అయ్యే 'రాధే శ్యామ్' కు కూడా భూషణ్ కుమార్ నిర్మాతగా ఉన్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా మరియు బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ లతో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ - సందీప్ కాంబోలో రానున్న #Prabhas25 అఫిషియల్ అనౌన్స్ మెంట్ ను ఇవ్వనున్నారు. కాకపోతే కేవలం స్టోరీ లైన్ మాత్రమే అనుకొని.. పూర్తి స్క్రిప్ట్ లాక్ చేయకుండానే ప్రాజెక్ట్ ప్రకటిస్తున్నారని టాక్. ఏదేమైనా 'అర్జున్ రెడ్డి' 'కబీర్ సింగ్' వంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్.. ప్రభాస్ ను ఖచ్చితంగా ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపించగలరని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Tags:    
  • Prabhas 
  • Tollywood 
  • Actor 
  • latest news 
  • Movie News 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS