డబ్బులు చెల్లించి మరీ మీమ్స్ పేజెస్ క్రియేట్ చేయించుకుంటున్న హీరోలు...!

Update: 2020-07-31 04:45 GMT
మీమ్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రెండ్. ఏదైనా విషయాన్ని ఇతరులకు చెప్పి నవ్వించడానికి పెద్ద పెద్ద కామెడీ స్టోరీస్ రాయాల్సిన అవసరం లేదని.. జస్ట్ ఓ బొమ్మ దాని కింద కింద కొన్ని అక్షరాలు చాలని చెప్తాయి మీమ్స్. అందుకే ఇప్పుడు అందరూ ఏదైనా సమాచారాన్ని త్వరగా రీచ్ అయ్యేలా చూడటం కోసం మీమ్స్ ని మార్గంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు ఈ ట్రెండ్ ని బాగా ఫాలో అవుతున్నారు. సినిమా పబ్లిసిటీ చేసుకోడానికి తమని తాము పాపులర్ చేసుకోడానికి మీమ్స్ ని ఆశ్రయిస్తున్నారు.

అందుకే టాలీవుడ్ హీరోలు తమపై మీమ్స్ చేసిన వారికి పార్టీస్ కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది అప్ కమింగ్ హీరోలు డబ్బులు చెల్లించి మరీ మీమ్స్ పేజెస్ క్రియేట్ చేసుకుంటున్నారని సమాచారం. మీమ్స్ పేజీల ద్వారా బుజ్ క్రియేట్ చేసుకునే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లే డబ్బులు ఇచ్చి ట్రోల్ల్స్ చేయించుకొని.. మళ్ళీ వాళ్లే వాటిని ఖండిస్తున్నట్లుగా ప్రోజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇది నిజం కాకపోతే హీరో అండర్ వేర్ గురించి మీమ్స్ వాళ్ళు కనిపెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారా? అనే అనుమానం రాకమానదు.

కాగా సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేపించుకునే క్రమంలో ఒక్కో మీమ్ పేజీకి దాదాపు 40 వేలు నుంచి లక్ష రూపాయలు వరకు చెల్లించి కొందరు హీరోలు ఈ తరహా పబ్లిసిటీకి చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఇలాంటి ప్లాన్స్ తో బజ్ క్రియేట్ చేసుకుంటున్నవారు మళ్ళీ కిల్ ఫేక్ న్యూస్ అంటూ కాంపెయినింగ్ చేయడం మెయిన్ స్ట్రీమ్ మీడియాని బలిపశువుని చేసి ఆడుకోవడమే కదా. దీనిని బట్టి చూస్తే వీళ్లంతా మీమ్స్ పేజెస్ కి ఇచ్చినంత వాల్యూ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇవ్వడం లేదని అర్థం అవుతోంది.
Tags:    

Similar News