నేను ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను : ఉపాసన

Update: 2020-07-09 15:57 GMT
మెగాస్టార్ చిరంజీవి కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అటు మెగా ఫ్యామిలీ బాధ్యతలను ఇటు అపోలో హాస్పిటల్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది ఉపాసన. అపోలో లైఫ్ వైస్ చైర్‌ పర్సన్‌ గా మరియు బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌ గా బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి కూడా సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఉపాసన డైలీ ఏదొక అప్డేట్ తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్ చెప్పడంతో పాటు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ప్రాణిక్ హీలింగ్ ను ప్రమోట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది ఉపాసన. ఇప్పుడు లేటెస్టుగా ట్విట్టర్ వేదికగా మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.

"నన్ను నేను క్షమించుకుంటాను.. నాకు హాని కలిగించిన ఇతరులను కూడా నేను క్షమించాను" “నేను అవుతున్న వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను” ''భావోద్వేగ గాయాలను నయం చేయడంలో సహాయపడే సెల్ఫ్ హీలింగ్ మార్గాలను పాటించండి. ప్రేమను పంచండి'' అని ఉపాసన కొణిదల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దీనికి ఫ్లవర్స్ పట్టుకొని తీక్షణంగా చూస్తున ఓ ఫోటో జత చేసింది. ఈ ట్వీట్ కి నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇతరులను క్షమించటానికి అందరికీ సెల్ఫ్ హీలింగ్ మరియు సెల్ఫ్ లవ్ అవసరమని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం 'మీకు దగ్గర వ్యక్తులతో ఏమైనా మనస్పర్థలు వచ్చాయా మేడమ్' అని ప్రశ్నిస్తున్నారు. మరి మెగా కోడలు ఉపాసన ఏమి ఆలోచించి ఈ పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Tags:    

Similar News