• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రకాశ్ రాజ్ కి...

ప్రకాశ్ రాజ్ కి ప్రత్యామ్నాయం లేదంతే!

By - Tupaki Desk
Update: 2021-04-21 17:30 GMT
ప్రకాశ్ రాజ్ .. విభిన్నమైన పాత్రలకు .. విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరు. తొలినాళ్లలో ప్రకాశ్ రాజ్ ను తెరపై చూసినవారు, ఆయన యాక్టింగ్ రఘువరన్ స్టైల్ కి దగ్గరగా ఉందని అనుకున్నారు. కానీ ఆ తరువాత ప్రకాశ్ రాజ్ స్టైల్ ప్రత్యేకమనుకుని ఆయనను మరింతగా అభిమానించడం మొదలుపెట్టారు. ఎదురుగా ఎంతటి స్టార్లు ఉన్నా యాక్టింగ్ పరంగా ప్రకాశ్ రాజ్ తనదైన సత్తా చూపుతూనే ఉంటారు. పెదాలు కాస్త ముడిచి .. తలాడిస్తూ .. చూపుడు వేలు చూపిస్తూ .. కళ్లద్దాలలో నుంచి పైకి చూడటం ఆయన బాడీ లాంగ్వేజ్ గా కనిపిస్తుంది.

ఇక ప్రకాశ్ రాజ్ డైలాగ్ డెలివరీ చాలా వెరైటీగా ఉంటుంది. డైలాగ్ ను ఎక్కడ విడగొట్టాలో ఆయనకి బాగా తెలుసు. విలన్ పాత్రలు చేసినా .. బిజినెస్ మెన్ పాత్రలు పోషించినా ... పల్లె పెద్దగా చక్రం తిప్పే వేషాలు వేసినా ఆ పాత్రలపై ఆయనదైన ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. విలన్ గా పాత్రల్లో ఎంత గొప్పగా ఇమిడిపోతారో .. ఒక తండ్రి పాత్రలో అంతే గొప్పగా ఆయన ఒదిగిపోతారు. ఏడాదికి డజను సినిమాల వరకూ ప్రకాశ్ రాజ్  చేస్తే, అందులో సగం తెలుగు సినిమాలే ఉంటాయి. మిగతా సగంలో తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు కనిపిస్తాయి.

అయితే గతంలో మాదిరిగా ఈ మధ్య కాలంలో ప్రకాశ్ రాజ్ ఎక్కువగా కనిపించడం లేదు. అంటే ఆయన స్థాయికి తగిన పాత్రలు పడటం లేదు. ప్రకాశ్ రాజ్ చేసే ఎమోషన్స్ తో కూడిన పాత్రలు మురళీశర్మకి ఎక్కువగా వెళుతున్నాయనీ, అలాగే నెగెటీవ్ షేడ్స్ తో కూడిన పాత్రలు రావు రమేశ్ కి ఎక్కువగా వెళుతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కానీ ఇటీవల 'వకీల్ సాబ్' విడుదలైన తరువాత, ప్రకాశ్ రాజ్ కి ప్రత్యామ్నాయం లేదని అంతా అనుకున్నారు. ఈ సినిమాతో మళ్లీ ఆయన ప్ర్రభావం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు, ఇటు ఇండస్ట్రీలోనూ .. అటు అభిమానుల్లోను వినిపిస్తున్నాయి.     
Tags:    
  • prakash raj 
  • prakash raj movies 
  • prakash raj updates 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS