టీజర్ టాక్: రేయ్ మహేష్ కొట్టరా వాడిని
'C/o కంచరపాలెం' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకటేష్ మహా తన రెండవ ప్రయత్నంగా 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'మహేషింటే ప్రతీకారం' చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. నరేష్.. సుహాస్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. శోభు యార్లగడ్డ.. ప్రసాద్ దేవినేని ఈ సినిమాకు నిర్మాతలు.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఒక నిముషానికి పైగా ఉన్న ఈ టీజర్లో కథను రివీల్ చెయ్యకుండానే జస్ట్ సినిమా ఎలా ఉంటుందో అనే శాంపిల్ చూపించారు. హీరో సత్యదేవ్ ను మహేష్ అనే పాత్రలో ఫోటోగ్రాఫర్ గా చూపించారు. మొదటి సీన్ లోనే సత్యదేవ్ ఓ పెద్ద చెట్ల మధ్య నుంచి సూర్య కిరణాలు వస్తుంటే ఆ క్షణాన్ని తన కెమెరాతో బంధిస్తూ ఉంటాడు. నేపథ్యంలో మహేషూ.. మహేష్.. అరె మహేష్.. మహేష్ గారు.. అంటూ చాలా మంది పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్స్ లో కొందరికి ఫోటోలు తీస్తూ చిన్ డౌన్.. షోల్డర్ డౌన్.. ఐస్ ఓపెన్.. రెడీ అంటూ కస్టమర్లకు సూచనలు ఇస్తూ ఉంటాడు. ఇక హీరోయిన్ పరిచయం అయితే.. ఏడుపు మొహం తో ఉంటుంది. కానీ హీరో అలా కెమెరా ఫోకస్ చెయ్యగానే వెంటనే చిరునవ్వు గా మారిపోయి పోజిస్తుంది. ఇక లాస్ట్ సీన్లో సత్యదేవ్ తో నరేష్ "రేయ్ మహేష్ కొట్టరా వాడిని" అంటూ రెచ్చగొడతాడు. దీంతో ఆవేశంగా సత్యదేవ్ ఎవరినో కొట్టడానికి ఉగ్ర రూపం దాలుస్తాడు..
కెమెరా అంటే అంత క్రేజు.. ఫోటోగ్రాఫర్ హంగామా చూస్తుంటే ఇది పీరియడ్ కథలా అనిపిస్తోంది. వెంకటేష్ మహా మొదటి సినిమా తరహాలో రియలిస్టిక్ ఫీల్ ఉంది. మరి ఈ ఫోటోగ్రాఫర్ కు ఎందుకు ఉగ్రరూపం ఎత్తాల్సి వచ్చింది ఏంటి కథ అనేది ఇంకొంచెం తెలియాలంటే ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడాలి. అంతలోపు టీజర్ చూసేయండి.
Full View