స్టాలిన్ కొడుకు సినిమా.. జయ ఇన్స్పిరేషన్!

Update: 2019-02-19 15:30 GMT
ఒక సినిమా తెరకెక్కించే సమయంలో ఏదో ఒక విషయంలో దర్శకుడు నిజ జీవితంలో ఉండే మనుషుల దగ్గర నుంచి కానీ.. లేదా ఇతర సినిమాల నుండి కానీ ప్రేరణ తీసుకోవడం సహజంగా జరిగేదే.  కొందరు ప్రేరణగా తీసుకున్న సంగతి ఓపెన్ గా చెప్పేస్తారు. కొందరు దర్శకులు మాత్రం నెటిజనులు కనిపెట్టిన తర్వాత కూడా ఒప్పుకోకుండా బుకాయిస్తారు.  కానీ శ్రీను రామస్వామి మొదటి కేటగిరి.

మాకు శ్రీను వైట్ల తెలుసు గానీ ఈ శ్రీను రామస్వామి ఎవరో తెలీదంటారా? ఆయన ఒక తమిళ దర్శకుడు.  'కూడల్ నగర్' తో మొదలు పెట్టి 'ధర్మ దురై' లాంటి  ఒక అర డజను సినిమాలను ఎడా పెడా డైరెక్ట్  చేశారు. ఇప్పుడు ఆయన ఉదయనిధి స్టాలిన్.. తమన్నా హీరో హీరోయిన్లు గా 'కన్నె కలైమానె' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా ఫిబ్రవరి 22 న తమిళనాట రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీను రామస్వామి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిపారు.  ఈ సినిమా తమన్నా పాత్రకు 'అమ్మ' జయలలితను ప్రేరణగా తీసుకున్నామని చెప్పారు.

హీరోయిన్ క్యారెక్టర్ ధైర్యానికి ప్రతిరూపంగా ఉంటుందని.. అందుకే దివంగత ముఖ్యమంత్రి జయలలిత ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తమన్నా పాత్రను డిజైన్ చేసినట్టుగా చెప్పాడు. కరుణానిధి మనవడు.. ప్రస్తుతం డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తనయుడి సినిమాలో హీరోయిన్ పాత్రకు వారి బద్ద వ్యతిరేకి అయిన 'అమ్మ' ను ప్రేరణగా తీసుకోవడం వింతగా అనిపించడం లేదా.  అయినా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు .. సినిమాలు.. సినిమా రాజకీయలు అర్థం కాకం చాలామంది జుట్టు పీక్కుంటున్నారు.. అలాంటి సమయంలో ఈ ద్రవిడ మున్నేట్ర కళగం.. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ నాయకులు వారి ప్రేరణ సంగతులు ఎక్కువగా అలోచించాల్సిన అవసరం లేదు లెండి.
    

Tags:    

Similar News