బ్యాచిలర్ : ఆ రెండు సినిమాలు గుర్తు వస్తున్నాయి
అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా దసరాకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. గత ఏడాది నుండి ఎప్పుడెప్పుడా అంటూ అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతిభవంతుడు అయిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందడంతో పాటు అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడు అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమద్య కాలంలో చూడని విభిన్నమైన ప్రేమ కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా మేకర్స్ మొదటి నుండి చెబుతున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. అఖిల్ మరియు పూజా హెగ్డేల రొమాంటిక్ స్టిల్స్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై ఆసక్తి మరింతగా పెరిగింది. కరోనా కారణంగా ఆలస్యం అయిన సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత రెండు సినిమాలు గుర్తుకు వస్తున్నాయి అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మొదటిది రామ్ చరణ్ నటించిన ఆరంజ్. ఆ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం అనే విషయం తెల్సిందే. ఆ సినిమాలో హీరో ప్రేమ విషయంలో చాలా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ విషయంలో అతడి అభిప్రాయం అందరికి వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే ఆయన చాలా మంది అమ్మాయిలతో బ్రేకప్ అవుతాడు. ఇక రెండవ సినిమా విషయానికి వస్తే అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను. ఈ సినిమాలో కూడా అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటూ వారితో ఎంటర్ టైన్ అవుతూ ఉంటాడు హీరో. మొదట హీరోయిన్ ప్రేమించిన సమయంలో అతడు ఆసక్తి చూపించడు. ఆ తర్వాత ప్రేమించి ప్రేమను గెలుచుకుంటాడు. ఈ రెండు సినిమాల కథను మిక్స్ చేసి బ్యాచిలర్ కథను రాశారా అన్నట్లుగా ట్రైలర్ చూస్తే అనుమానాలు కలుగుతున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బ్యాచిలర్ గా అఖిల్ చాలా మంది అమ్మాయిలతో మాట్లాడటం చూపించారు. ఆ తర్వాత పూజా హెగ్డే తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత కూడా ఇద్దరి మద్య క్లాష్ లు రావడం అంతా చూస్తుంటే కథ ఆరంజ్ లక్షణాలను కలిగి ఉందని అంటున్నారు. ఆరంజ్ సినిమా కథ విషయంలో ఎలాంటి మిస్టేక్ లేదు. కాని దాన్ని చూపించిన విధానంలో తేడా కొట్టింది. పైగా బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టారు. కనుక ఆ సినిమా నిరాశ పర్చింది. ఇప్పుడు ఆ కథకు కాస్త పోలిక ఉంటే మంచిదే కాని నష్టం ఏమీ లేదు. అలాగే అఖిల్ మిస్టర్ మజ్ను కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ స్టోరీ లైన్ కూడా విభిన్నంగా ఉంటుంది. కనుక ఒక వేళ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా కథకు ఆ సినిమాల కథలతో పోలికలు ఉన్నా కూడా వచ్చే నష్టం ఏమీ లేదని.. ఖచ్చితంగా ఈసారి అఖిల్ బాబు బ్లాక్ బస్టర్ సక్సెస్ ను కొట్టడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో చెబుతున్నారు.