• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రౌడీ స్టార్ లైనప్ లో మరో...

రౌడీ స్టార్ లైనప్ లో మరో ఇద్దరు క్రేజీ డైరెక్టర్స్..?

By - Tupaki Desk
Update: 2022-11-24 03:30 GMT
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ ఏడాది 'లైగర్' సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూశారు. దీంతో వీలైనంత త్వరగా సాలిడ్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే VD ప్లాన్ చేసుకున్నట్లు ఏమీ జరగడం లేదు. 'JGM' ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడం.. 'ఖుషి' సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో యువ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడొస్తుందనేది తెలియకుండా ఉంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న 'ఖుషి' సినిమా లేట్ అవుతుండటంతో.. విజయ్ దేవరకొండ కొత్త స్క్రిప్ట్స్ వినే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత... గౌతమ్ ఇటీవల రౌడీ స్టార్ ని కలిసి తన కథతో మెప్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీడీ మరో డైరెక్టర్ ని లైన్ లో పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరియు విజయ్ దేవరకొండ కాంబినేషనల్ లో ఓ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. హరీష్ గత మూడేళ్ళుగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరోని వెతుక్కుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా అనౌన్స్ చేసారు కానీ.. జనసేన అధినేత ఇతర ప్రాధాన్యతల కారణంగా ఆ చిత్రం ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ తో సహా పలువురు హీరోల డేట్స్ కోసం ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు విజయ్ తో చేయడానికి రెడీ అవుతున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. 'ఖుషి' చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

హరీష్ శంకర్ మాస్ కమర్షియల్ చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో మంచి కమర్షియల్ కథతో సినిమా చేయాలని అనుకుంటున్నారట. కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రౌడీ హీరో.. హరీష్ చెప్పిన స్క్రిప్ట్ కు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. హరీష్ - విజయ్ లది క్రేజీ కాంబినేషన్ అవుతుందని భావించవచ్చు.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ సినిమాపై ఆశలు చిగురించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పూజ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. దీంతో హరీష్ నెక్స్ట్ మూవీ పవన్ తో ఉంటుందా? విజయ్ తో ఉంటుందా? లేదా మరో స్టార్ హీరోతో వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. 'గద్దలకొండ గణేష్' తర్వాత హరీష్ మరో సినిమా చేయలేదు. వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • VijayDevarkonda 
  • HarishShankar 
  • GauthamThunuri 
  • LigerDisater 
  • Tollywood 
  • JGM 
  • TollywoodIndustry 
  • BhavadeyuduBhagatSingh 
  • RamCharan 
  • MovieNews 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS