ఇప్పటికి ఇద్దరు కావాల్సిందేనా నాగ్?
నాగార్జున మన్మధుడు చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని వైల్డ్ డాగ్ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి అహిషోర్ సోలమన్ దర్శకత్వం వహిస్తుండగా దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది. చాలా విభిన్నమైన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా సైయామీ ఖేర్ నటించబోతుందట.
గతంలో నాగార్జున తన ప్రతి సినిమా లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ను కోరుకుంటాడు. కథ డిమాండ్ ఉన్నా లేకున్నా కూడా నాగార్జున ఇద్దరు హీరోయిన్స్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు అంటూ గతంలో టాక్ ఉండేది. ఇద్దరు హీరోయిన్స్ ఎందుకు అంటూ పదే పదే నాగార్జునపై అప్పట్లో కథనాలు కూడా వచ్చేవి. ఆ తర్వాత కాలక్రమేనా నాగార్జున సింగిల్ హీరోయిన్ తోనే ఎక్కువ సినిమాలు చేశాడు. మళ్లీ ఇప్పుడు చేస్తున్న వైల్డ్ డాగ్ చిత్రంకు గాను ఇద్దరు హీరోయిన్స్ తో వర్క్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
ఈ నేపథ్యంలో నెటిజన్స్ కొందరు ఆరు పదుల వయసు లో కూడా ఇంకా ఇద్దరు హీరోయిన్స్ కావాలా నాగ్ అంటూ సరదా గా కామెంట్స్ చేస్తున్నారు. నీ కొడుకులు ఒక్కో హీరోయిన్ తో సరి పెట్టుకుంటూ ఉంటే నీకు మాత్రం ఇంకా ఇద్దరు కావాల్సిందేనా అంటున్నారు. అందుకే నీవు రియల్ మన్మధుడి వి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి వైల్డ్ డాగ్ చిత్రం లో సైయామీ ఖేర్ అతి త్వరలోనే షూటింగ్ కు జాయిన్ కాబోతుంది.