• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  BB4 : మరో రెండు...

BB4 : మరో రెండు ఇంట్రెస్టింగ్‌ పేర్లు

By - Tupaki Desk
Update: 2020-08-18 10:10 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ కౌంట్‌ డౌన్‌ మొదలయ్యింది. వారం లేదా రెండు వారాల్లోనే ఈ షో మొదలయ్యే అవకాశం ఉంది. నాగార్జున ప్రోమో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ముందు రాబోతున్న ప్రోమోలో డేట్‌ ను అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ జాబితా దాదాపుగా ఫైనల్‌ అయినట్లే అంటున్నారు. గత మూడు సీజన్‌ లతో పోల్చితే ఈ సీజన్‌ లో కంటెస్టెంట్స్‌ చాలా విభిన్నంగా ఉంటారని చెబుతున్నారు. ఎక్కువగా వివాదాలు ఉండేలా ప్లాన్‌ చేసి మరీ కంటెస్టెంట్స్‌ ను బిగ్‌ బాస్‌ కోసం ఎంపిక చేశారట.

ఇప్పటి వరకు ఎన్నో పేర్లు ప్రచారం జరిగాయి. వాళ్లలో కొందరు మౌనంగా ఉంటే మరికొందరు మాత్రం తాము బిగ్‌ బాస్‌ కు వెళ్లడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. మౌనంగా ఉన్న వాళ్లు అంతా వెళ్తున్నారా అంటే అది కూడా క్లారిటీ లేదు. ఈ సమయంలోనే మరో రెండు ఇంట్రెస్టింగ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి సోషల్‌ మీడియాలో హాట్‌ ఆంటీ అంటూ పిలిపించుకుంటున్న నటి సురేఖ వాణి ఈ సీజన్‌ లో ఒక కంటెస్టెంట్‌ గా ఉండబోతుందని అంటున్నారు.

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో సురేఖ వాణి తన కూతురుతో కలిసి చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆ కారణంగానే ఆమెను ఎంపిక చేశారేమో అంటున్నారు. ఇక బుల్లి తెరపై సమంత స్థాయి క్రేజ్‌ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ సమీరా. ఎప్పుడైతే ఈమె పెళ్లి చేసుకుందో అప్పటి నుండి సీరియల్స్‌ లో కనిపించడం కాస్త తక్కువ అయ్యింది. ఆమద్య అదిరింది కామెడీ షో యాంకర్‌ గా వ్యవహరించింది. ఆ తర్వాత కొన్ని షోల్లో కనిపించింది.

ఇక అత్త సనతో కలిసి రెగ్యులర్‌ గా యూట్యూబ్‌ లో వీడియోలో అలరిస్తున్న సమీరా బిగ్‌ బాస్‌ కు ఎంపిక అయ్యిందట. వీరిద్దరు వారి వారి రంగాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న వారు. ప్రేక్షకుల్లో మంచి ఆధరణ దక్కించుకున్న వారు. కనుక ఖచ్చితంగా వీరిద్దరు కూడా షోకు గ్లామర్‌ ను తెచ్చి పెడతారంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS