బాలీవుడ్ నటీమణుల మధ్య ట్విట్టర్ వార్..!

Update: 2021-01-04 06:26 GMT
బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్ - ఊర్మిళ మంటోడ్కర్‌ మధ్య చాలా రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. డ్రగ్స్ కేసు నేపథ్యంలో బాలీవుడ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కంగనాపై సీనియర్ నటి ఊర్మిళ స్పందిస్తూ.. నీ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌ లో డ్రగ్స్ రాకెట్ గురించి చూసుకోమని.. బాలీవుడ్‌ లో జరిగే ప్రతీ దానిపై కంగన అనవసరంగా మాట్లాడుతుందంటూ సీరియస్ అయింది. దీనిపై రియాక్ట్ అయిన కంగనా 'ఊర్మిళ కు అసలు నటన రాదని.. అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయడం మాత్రమే తెలుసని.. తన దృష్టిలో ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్‌ స్టార్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఊర్మిళ మంటోడ్కర్‌ ఇటీవల శివసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. శివసేనలో జాయిన్ అయిన కొన్ని రోజులకే 3 కోట్ల ఖరీదైన ఆఫీస్ కొనుగోలు చేయడంపై శివసేన అంటే అసలు పడని కంగనా కామెంట్స్ చేసింది. ఊర్మిళా జీ నా కష్టార్జితంతో కట్టుకున్న ఇంటిని కాంగ్రెస్ కూల్చేసింది. నేను బీజేపీ కి బాసటగా నిలిచినందుకు నాపై 25 నుంచి 30 కేసులు పెట్టారు అని ట్వీట్ చేసింది. దీనిపై ఊర్మిళ ఘాటుగానే స్పందించింది. ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ తనపై చేసిన విమర్శలకు బదులిస్తూనే కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీ కల్పిచడంపై ప్రశ్నించింది. 'కంగనా జీ నేను 25 నుంచి 30 ఏళ్ల కష్టపడి పనిచేసిన తర్వాత రాజకీయాల్లోకి రాకముందే 2011లో ఫ్లాట్ కొన్నాను. దానికి సంబంధించిన డాకుమెంట్స్ ప్రూఫ్ చూపిస్తాను. అలానే ఇప్పుడు ఆఫీస్ ని కూడా నా హార్డ్ వర్క్ తో సంపాదించిన డబ్బుతోనే కొన్నానని పేపర్స్ చూపిస్తాను. డ్రగ్స్ కేసులో కొంతమంది నేమ్స్ బయటపెడతానని.. నాకు వారి నుంచి ప్రమాదం ఉందని వై ప్లస్ సెక్యూరిటీ కల్పించుకున్నావు. మనం కలిసి ఈ డ్రగ్స్ పై పోరాడదాం. అయితే నువ్వు చెబుతా అన్న లిస్ట్ బయటపెట్టాలి' అని ఊర్మిళ ప్రశ్నించింది.
Tags:    

Similar News