శ్రావణి ఆత్మహత్యలో నిర్మాతే సూత్రధారినా?
టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఆర్‌ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను తప్పుగా అర్థం చేసుకుంటూ ఈ కేసులోకి లాగుతున్నారని మీడియా ముందు నిర్మాత అశోక్ రెడ్డి వాపోయారు. అతను చెప్పినప్పటికీ, బయటకు వస్తున్న సమాచారం భిన్నంగా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
అశోక్ రెడ్డికి 2017 నుండి శ్రావణితో సంబంధం ఉందని, ఆమెకు ఆర్ఎక్స్ 100లో అతిథి పాత్ర అందుకే ఇచ్చారని దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. తరువాత నిర్మాత అశోక్ రెడ్డి ఆమె ఆర్థిక సమస్యలను తీర్చడానికి కొంత డబ్బు ఇచ్చాడని.. తద్వారా ఆమెను శారీరకంగా మానసికంగా హింసించాడని పోలీసులకు విచారణలో తెలిసినట్టు సమాచారం. శ్రావణిని తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నాడని.. తన అనుమతి లేకుండా ఎవరినీ వివాహం చేసుకోకూడదని ఆమెను హెచ్చరించాడని విచారణలో తేలినట్లు తెలిసింది.
శ్రావణి ఆత్మహత్య చేసుకున్న రోజుకు ముందే అశోక్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు ఆమెను హెచ్చరించినట్టు సమాచారం. అదే సమయంలో ఇంటికి వచ్చిన సాయి రెడ్డి కూడా తన ప్రేమను నిరాకరించి దేవరాజ్ ను వివాహం చేసుకోకూడదని వేధించాడని పోలీసులు గుర్తించారు. అశోక్ రెడ్డి, సాయి రెడ్డిలతో శ్రావణి కి సంబంధాలున్నాయని తెలిసి దేవరాజ్ కూడా శ్రావణిని దూరం పెట్టాడని పోలీసులు గుర్తించారు.
మొత్తానికి, ఈ కేసు లో నిందితుడు కాదని మొదట్లో నిర్మాత అశోక్ రెడ్డి కూడా తాజా నివేదిక ల ప్రకారం ఆమె ఆత్మహత్య లో ఒక భాగమే అనిపిస్తోంది. ఈ కథ ఎక్కడికి వెళుతుందో, ఎలా ముగుస్తుందో చూడాలి.