రష్మిక.. దాన్ని లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేరా?
రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఆమె తండ్రి మదన్ మందన్న ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్.;
స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న 30వ పుట్టినరోజు ఈసారి మరింత ప్రత్యేకంగా మారింది. ఇటీవల హీరో విజయ్ దేవరకొండ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమెకు.. పెళ్లి తర్వాత వచ్చిన తొలి బర్త్ డే కావడంతో కుటుంబ సభ్యులు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 5న నేటివ్ ప్లేస్ కూర్గ్ (కొడగు)లో ఆ వేడుకలు ఎంతో ఆత్మీయంగా జరిగాయి.
రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఆమె తండ్రి మదన్ మందన్న ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. కూతురిపై ఉన్న ప్రేమను చాటుతూ ఆయన ఒక విలాసవంతమైన బంగ్లాను కానుకగా అందించారు. సెరినిటీ అనే పేరుతో ఉన్న ఆ బంగ్లా పీస్ ఫుల్ నెస్ కు సింబల్ గా నిలుస్తోంది. ప్రకృతి మధ్యలో సౌకర్యాలతో నిర్మించిన ఆ విల్లా రష్మికకు జీవితాంతం గుర్తుండిపోయే బహుమతిగా మారింది.
విరాజ్ పేట సమీపంలో ఉన్న ఆ లగ్జరీ బంగ్లా ఖరీదు కోట్లు దాటినట్లు సమాచారం. కచ్చితమైన విలువ బయటకు రానప్పటికీ.. దాదాపు రూ.10 నుంచి 15 కోట్ల మధ్య ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. విశాలమైన గార్డెన్, ఆధునిక సదుపాయాలు, ప్రశాంతమైన వాతావరణం ఆ విల్లా స్పెషాలిటీ అని తెలుస్తోంది. తండ్రి ఇచ్చిన ఆ గిఫ్ట్ చూసి రష్మిక భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం.
కుటుంబం ఇచ్చే ప్రేమ, ఆదరణే తన విజయానికి కారణమని ఆమె భావించారు. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియాలో పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా రష్మిక తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి పాడి లోని శ్రీ ఇగ్గుతప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు.
సంప్రదాయ కొడవ దుస్తుల్లో మెరిసిన విరోష్ జంట అభిమానులను ఆకట్టుకుంది. అలాగే తన పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రష్మిక. అదే సమయంలో వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులు గ్రామస్తులకు లంచ్ ఏర్పాటు చేశారు. టాలెంటెడ్ స్టూడియోస్ కు స్కాలర్ షిప్స్ ప్రకటించడం విశేషంగా నిలిచింది. తమ వ్యక్తిగత ఆనందాన్ని సమాజంతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో జరిగిన వివాహం తర్వాత, మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించిన ఆ జంట ఇప్పుడు కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉన్నారు.. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ లో కూడా మంచి ఫామ్‌లో ఉన్న రష్మిక మందన్నకు 30వ పుట్టినరోజు మరపురాని జ్ఞాపకంగా నిలిచింది. అంతే కాదు లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్ అందించింది.