అల్లు అర్జున్ 'రాకా'.. ఇలాంటి స్టోరీకి ఓకే చెప్పే ప్రసక్తే లేదేమో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌ డే సందర్భంగా వచ్చిన ఆయన అప్ కమింగ్ మూవీ రాకా ఫస్ట్ లుక్ డిఫరెంట్‌ గా ఉండడంతో సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.;

Update: 2026-04-10 14:05 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌ డే సందర్భంగా వచ్చిన ఆయన అప్ కమింగ్ మూవీ రాకా ఫస్ట్ లుక్ డిఫరెంట్‌ గా ఉండడంతో సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గుండుతో, నుదుటిపై గాయాలతో, చేతిలో తోడేలు టచ్‌ తో కనిపించిన ఆయన గెటప్ ఆసక్తిని రేకెత్తించింది. మొదటి నుంచి రాకా సినిమా పునర్జన్మలు, ప్యారలెల్ వరల్డ్స్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో రీసెంట్ గా ప్రాజెక్ట్‌ పై ఆ మూవీ డైరెక్టర్ అట్లీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాకా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దర్శకుడిగా మారకముందే కథ ఆలోచన తనకు వచ్చిందని ఆయన తెలిపారు. దాదాపు 18 ఏళ్లుగా స్టోరీని తనలో మోస్తున్నానని, అది తన జీవితాన్ని మలిచిన ఆలోచన అని చెప్పడం గమనార్హం. ఆ వ్యాఖ్యలతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

అయితే టైటిల్, ఫస్ట్ లుక్ ఆధారంగా సోషల్ మీడియాలో స్టోరీపై అనేక థియరీలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక రెడ్డిట్ యూజర్ చెప్పిన స్టోరీ లైన్ ఇప్పుడు చర్చకు దారితీసింది. దాని ప్రకారం.. సినిమాలో బన్నీ తల్లిదండ్రులు (దీపిక పదుకొనె, ఆమె భర్త) మరో వరల్డ్ కు చెందిన రాజు, రాణి అంట. వారి కుటుంబంలో ఉన్న ఓ వ్యక్తి కారణంగా కథలో ఘర్షణ మొదలవుతుందని గెస్ చేశాడు. హీరోను రక్షించేందుకు మానవ ప్రపంచానికి పంపించడమే కథకు మలుపు అంట.

తర్వాత పెద్దయ్యే హీరోకు రష్మిక మందన్న ప్రేయసిగా మారుతుందని, మరోవైపు మృణాల్ ఠాకూర్ అసలు ప్రపంచానికి చెందిన వ్యక్తిగా వచ్చి అతని గతాన్ని తెలియజేస్తుందనీ.. అలా కథ సాగుతుందని చెప్పాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే, ప్రేయసిగా కనిపించే పాత్ర నిజానికి విలన్ వైపు నుంచి పంపిన వ్యక్తి అంట. ఆ తర్వాత యాక్షన్, ఛేజ్ సీన్స్‌ తో కథ ముందుకు సాగుతుందని ఆ యూజర్ ఊహించాడు.

ఇంకా కథలో స్పెషల్ సాంగ్ కోసం జాన్వీ కపూర్ పాత్ర కూడా ఉంటుందని చెప్పడం విశేషం. చివరికి హీరో తన అసలు పవర్స్ తో విలన్ ను ఓడించి రాజ్యాన్ని కాపాడతాడని ఆ స్టోరీలో పేర్కొన్నాడు. అయితే కథ సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే కొందరు స్టోరీ లైన్‌ ను పూర్తిగా క్రియేషన్ అని, అసలు నమ్మలేకపోతున్నామని ట్రోల్ చేస్తున్నారు.

ఇంత కామెడీగా ఉన్న కథను స్టార్ హీరో ఎంచుకోరని కామెంట్లు చేస్తున్నారు. బన్నీ అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఇప్పటికైతే మాత్రం రాకా మూవీ కథ అంటూ వైరల్ అవుతున్న స్టోరీ.. అంతా సోషల్ మీడియా ఊహాగానమేనని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అసలు కథ ఏంటన్నది మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించాక స్పష్టత రానుంది.

Tags:    

Similar News