ప్రెగ్నెంట్‌ ను కాదంటూ అర్థ నగ్న ఫొటోలు పోస్ట్‌

Update: 2018-09-09 10:46 GMT
ఉత్తరాది బుల్లి తెర ప్రేక్షకులకు సలోని చోప్రా సుపరిచితురాలు. పలు టీవీ షోలు మరియు రియాల్టీ షోలతో ఈమెకు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఉత్తరాదిన ఈమెకు మంచి క్రేజ్‌ ఉంది. ఈమె బుల్లి తెరపైనే కాకుండా సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఈమె చాలా హాట్‌ - బోల్డ్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌ ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా సలోని చోప్రా గర్బవతి అంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ మీడియాలో ఈ వార్తలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తాను గర్బవతిని కాదు మొర్రో అంటూ నిరూపించుకునేందుకు పెద్ద సాహసమే చేసింది.

తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ ప్రస్తుతం దుమారంను రేపుతోంది. తాను గర్బవతిని కాదని - కావాలంటే తన పొట్ట ఫ్లాట్‌ గా ఉంది చూసుకోండి అంటూ అర్థ నగ్న ఫొటో పోస్ట్‌ చేసి మరీ నిరూపించుకుంది. ప్రస్తుతం షూటింగ్‌ నిమిత్తం బెల్జియం వెళ్లిన సలోని చోప్రా తాను బస చేస్తున్న హోటల్‌ రూపం బాల్కనిలో అర్థనగ్నంగా నిల్చుని ఫొటోలు దిగి వాటిని పోస్ట్‌ చేసింది. టాప్‌ లెస్‌గా ఉన్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నడుము నాజూకుగా లేనంత మాత్రాన ప్రెగ్నెంట్‌ అంటూ ఎలా నిర్థారణకు వస్తారు అంటూ ఈమె కొందరిపై అసహనం వ్యక్తం చేసింది.

ఇంకా ఈమె ఇన్‌ స్టాలో సుదీర్ఘమైన పోస్ట్‌ లు పెట్టింది. వాటిలో వేదాంత దోరణితో మాట్లాడుతూ.. నాజూకుగా ఉన్న అమ్మాయిలు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారని, పొట్ట ఉన్న అమ్మాయిలు - నడుము పెద్దగా ఉన్న అమ్మాయిలు - బొద్దుగా ఉన్న అమ్మాయిలు అనారోగ్యంతో ఉన్నట్లుగా భావించడం ఎంత మాత్రం కరెక్ట్‌ కాదని, బొద్దుగా ఉండే అమ్మాయిలు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటారు అంటూ ఏదేదో పోస్ట్‌ చేసి ఫాలోవర్స్‌ ను కాస్త కన్ఫ్యూజ్‌ చేసింది. మొత్తానికి తాను ప్రెగ్నెంట్‌ కాదనే విషయాన్ని కాస్త విభిన్నంగా సాక్ష్యంతో సహా చూపించి అందరు ఒప్పుకునేలా చేసింది.
Tags:    

Similar News