మరో స్టార్‌ కు వైరస్‌ పాజిటివ్‌

Update: 2020-07-01 04:45 GMT
తెలుగు సినిమా మరియు బుల్లి తెర పరిశ్రమను మహమ్మారి వైరస్‌ భయపెడుతోంది. షూటింగ్స్‌ కు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో సీరియల్స్‌ మరియు షో ల షూటింగ్స్‌ జరుగుతున్నాయి. కొన్ని సినిమాల షూటింగ్స్‌ కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో సినిమా మరియు సీరియల్‌ సెలబ్రెటీలకు వైరస్‌ మహమ్మారి పాజిటివ్‌ వస్తోంది. దాంతో షూటింగ్స్‌ కు మళ్లీ బ్రేక్‌ పడనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా మరో బుల్లి తెర స్టార్‌ కు కూడా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. నా పేరు మీనాక్షి మరియు ఆమె కథ సీరియల్స్‌ లో హీరోయిన్‌ గా నటిస్తు తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తున్న నవ్య స్వామి వైరస్‌ బారిన పడ్డట్లుగా తెలుస్తోంది. స్వల్ప అనారోగ్య సమస్యతో ఆమె వైరస్‌ నిర్థారణ పరీక్షకు వెళ్లగా అక్కడ పాజిటివ్‌ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఆమె నటించిన సీరియల్‌ కాస్ట్‌ అండ్‌ క్రూ లో పలువురికి కూడా వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేస్తున్నారట.

బయట పడుతున్న కేసులు కొన్ని కాగా బయట పడని కేసులు కూడా కొన్ని ఉంటున్నాయని సీరియల్స్‌ షూటింగ్‌ సమయంలో కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా కొందరు షూటింగ్‌ జరుపుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అజాగ్రత్తగా ఉంటున్న కారణంగానే సీరియల్‌ స్టార్స్‌ కు వరుసగా వైరస్‌ పాజిటివ్‌ వస్తుందని అంటున్నారు. బుల్లి తెరకు చెందిన మరెంత మంది వైరస్‌ బారిన పడుతారో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News