బాడీ హ‌గింగ్ ఫ్రాకులో భాగ్య‌శ్రీ కిల్లింగ్

ఇటీవ‌ల‌ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేర్లలో భాగ్యశ్రీ బోర్సే ఒకటి. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.;

Update: 2026-03-03 04:42 GMT

ఇటీవ‌ల‌ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేర్లలో భాగ్యశ్రీ బోర్సే ఒకటి. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాడీ హగింగ్ ఫ్రాకులో భాగ్య‌శ్రీ‌ కనిపిస్తున్న తీరు అభిమానుల మతి పోగొడుతోంది. అదిరిపోయే ఫిజిక్‌తో, మతి చెడే అందంతో కవ్విస్తున్న భాగ్యశ్రీ.. తన గ్లామర్ విందుతో కుర్రకారుకు కునుకుప‌ట్ట‌నివ్వ‌కుండా చేస్తోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్ పై యూత్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.




 


భాగ్యశ్రీ కేవలం అందంతోనే కాదు, తన కిల్లర్ లుక్స్ , కాన్ఫిడెంట్ మూవ్స్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కెమెరా ముందు ఈ భామ‌ పలికించే హావభావాలు, గ్రేస్‌ఫుల్ కదలికలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. వెండితెరపై భాగ్య‌శ్రీ అందం, డ్యాన్స్ మూవ్స్ ఇప్పటికే సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. తనదైన శైలిలో కిల్లర్ పెర్ఫార్మెన్స్‌తో క‌ట్టి ప‌డేస్తున్న ఈ బ్యూటీ మునుముందు రోజుల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.




 


అందానికి అందం, దానికి తోడు చక్కటి నటనా ప్రతిభ తో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో రాకెట్ లా దూసుకెళుతోంది. అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోల కంట పడింది ఈ బ్యూటీ. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతోంది. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ వేగం చూస్తుంటే టాలీవుడ్ తో పాటు ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోను దూసుకెళుతుంద‌ని స్పష్టమవుతోంది.




 


సినీ పరిశ్రమలో సాధారణంగా ఒక సినిమా ఫలితం తదుపరి అవకాశాలను శాసిస్తుంది. కానీ భాగ్యశ్రీ విషయంలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. సక్సెస్, ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ఈ అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటోంది. త‌న‌లోని ఎనర్జీ , స్క్రీన్ ప్రెజెన్స్ మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అందుకే బాక్సాఫీస్ ఫలితాల కంటే కూడా ఈ బ్యూటీ నటనకే ఎక్కువ మార్కులు ప‌డుతున్నాయి. ఫలితంగా క్రేజీ ప్రాజెక్టులు తలుపు తడుతున్నాయి.




 


రామ్ పోతినేని సరసన నటించిన `ఆంధ్రా కింగ్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ, భాగ్యశ్రీకి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ మరియు ఎనర్జీ లెవల్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. దీంతో సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా భాగ్యశ్రీ సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా రామ్ వంటి ఎనర్జిటిక్ హీరోతో పోటాపోటీగా నటించడం ఆమె కెరీర్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది.




 


ఇక వ్యక్తిగత విషయానికి వస్తే... గత కొంతకాలంగా రామ్- భాగ్యశ్రీ మధ్య లవ్వాయణం సాగుతోందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా లేరా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది. రామ్ త్వరలోనే ఓ ఇంటివాడు అవుతాడని... భాగ్యశ్రీతో ఫిక్స్ చేస్తాడ‌ని అభిమానుల్లో గుస‌గుస వినిపిస్తోంది.

కెరీర్ మ్యాట్ కి వ‌స్తే.. ప్రస్తుతం భాగ్యశ్రీ‌ తదుపరి సినిమాల జాబితా కూడా ఆసక్తికరం. నాని వంటి స్టార్ హీరోలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులలో త‌న‌ పేరు పరిశీలనలో ఉంది. ఈ సస్పెన్స్ వీడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!

Tags:    

Similar News