పులి ఫోటోలపై విమర్శలు మొదలయ్యాయే!

Update: 2019-07-15 05:21 GMT
'నేల టికెట్' భామ మాళవిక శర్మ రెండు రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పులితో పోజులిస్తున్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  థాయ్ లాండ్ లోని పట్టాయా టైగర్ పార్క్ లో ఈ ఫోటోలు తీయించుకున్నానని.. ఆ పులికి మత్తు ఇవ్వడం.. డ్రగ్స్ ఇవ్వడం లాంటివి లేదని చెప్పింది.  పులి పుట్టిన సమయం నుండి మనుషులతో కలిసిమెలిసి ఉండేలా ట్రెయినింగ్ ఇవ్వడంతో ఇలా చక్కగా ఆడుతూ ఉంటాయని తెలిపింది.

కానీ క్రిటిక్స్ విమర్శించని సినిమా.. కామెంట్లు రాని ఉప్పల్ బాలు వీడియోలు.. జంతు ప్రేమికుల విమర్శలు ఎదుర్కోని ఇలాంటి వింత ఫోటోలు ఎక్కడైనా ఉంటాయా? అందులోనూ చూస్తేనే జనాలు జడుసుకుని చచ్చేలా ఉన్న పులితో.. అలా టెడ్డీ బేర్ తో ఇచ్చినట్టు పోజులు ఇస్తే జనాలు ఊరుకోరు కదా?  యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ లు.. యానిమల్ లవర్స్ అని చెప్పుకునే  కొందరు మాళవికపై విరుచుకుపడ్డారు.  "ఈ పులులకు ట్రెయినింగ్ ఇచ్చి అలా ఉందని అంటున్నావు..  పులికి డ్రగ్స్ ఇస్తారు.  లేకపోతే పులి అలా ఉండదు నువ్వు చేసింది జంతు హింస. పైగా ఇదేదో ఘనకార్యం అన్నట్టు ఫోటోలు షేర్ చేస్తున్నావు" అని ఒకరు విమర్శించారు.  మరొకరు.. "పులి అంటే బొమ్మ కాదు. నీకు పులితో అలా ప్రేమగా ఉండాలనిపిస్తే ఒక పులి బొమ్మ కొనుక్కో.  ఇలా నిజం పులిని ఇబ్బంది పెట్టడం క్యూట్ గా ఏమీ లేదు" అంటూ కసురుకున్నారు.

ఈ విమర్శకులు చెప్పే వెర్షన్ నిజమైతే.. పులులకు డ్రగ్స్ నిజంగా ఇస్తే ఆ థాయ్ లాండ్ ప్రభుత్వం ఈ పార్క్ కు అనుమతి ఎలా ఇచ్చిందో?  అక్కడ జంతు హక్కుల చట్టాలు లేవా?  పట్టయాలో.. థాయ్ లాండ్ లో యానిమల్ లవర్స్ లేరా? అక్కడ వారందరూ ఏం చేస్తున్నారు..?  

    

Tags:    

Similar News