క్లాసికల్ డాన్స్ తో మెప్పించిన త్రివిక్రం సతీమణి..!

Update: 2023-01-08 07:30 GMT
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సౌజన్యా శ్రీనివాస్ కు క్లాసికల్ డాన్స్ లో అనుభవం ఉన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు తన స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూ వస్తున్నారు సౌజన్య. లేటెస్ట్ గా శనివారం రాత్రి కూడా రవీంద్ర భారతిలో సౌజన్య క్లాసికల్ డాన్స్ తో అలరించారు. క్లాసికల్ డాన్స్ గురువు పసుమర్తి రామలింగయ్య శాస్త్రి గారి అధ్యక్షతన సౌజన్య భామా కలాపం పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి త్రివిక్రం శ్రీనివాస్ కూడా అటెండ్ అయ్యారు.

తన భార్యలోని ఈ క్లాసికల్ డాన్స్ ప్రతిభని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు త్రివిక్రం శ్రీనివాస్. అతనొక స్టార్ డైరెక్టర్ అయ్యుండి కూడా తన సతీమణికి ఆసక్తి ఉన్న ఈ సంప్రదాయ నృత్యం గురించి ఎలాంటి అడ్డు చెప్పకుండా ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తున్నారని చెప్పొచ్చు. సౌజన్య శ్రీనివాస్ పెద్దగా మీడియాకు పరిచయం లేకపోయినా సరే త్రివిక్రమ్ వైఫ్ గా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.  

సౌజన్య కు చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ లో ఆసక్తి ఉండటం అలా తన స్కూల్ ఏజ్ నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం జరిగిందట. అలా స్టేజ్ షోస్ ఇస్తూ క్లాసికల్ డాన్స్ లో తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు సౌజన్య శ్రీనివాస్. పెళ్లి తర్వాత తమ వ్యక్తిగత విషయాల మీద మహిళలకు ఆసక్తి తగ్గుతుంది కానీ ఒక దర్శకుడిగా తన భార్య ప్రతిభను గుర్తించి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు త్రివిక్రమ్.

సౌజన్య శ్రీనివాస్ కూడా తనకు వచ్చిన ప్రతిభను ఆవిష్కరించడంలో ఎలాంటి వెనకడుగు వేయరని తెలుస్తుంది. ఇప్పటికే సౌజన్య చాలా పర్ఫార్మెన్స్ లు ఇవ్వగా.. లేటెస్ట్ గా రవీంద్ర భారతి లోని ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ తో మళ్లీ వార్తల్లో నిలిచారు సౌజన్య. ఇక ఈ మధ్య సౌజన్య శ్రీనివాస్ కూడా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ తో కలిసి ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు సౌజన్య. వెనక ఉండి నడిపించేది త్రివిక్రమ్ అయినా నిర్మాతగా మాత్రం సౌజన్య పేరు పెట్టారు.  ఇక త్రివిక్రమ్ సినిమాల విషయానికి వస్తే మహేష్ తో హ్యాట్రిక్ మూవీ ఫిక్స్ చేసుకున్న త్రివిక్రమ్ ఆ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి కాగా నెక్స్ట్ షెడ్యూల్ ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.
Tags:    

Similar News