అలా పిలిచేవారు నా శత్రువులు : త్రివిక్రమ్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారు మాటల మాంత్రికుడు అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. మాటల మాంత్రికుడు అనే పేరు ఆయనకు బాగా సూట్ అవుతుందని, అది ఆయన బిరుదుగా మారిపోయిందని అంతా అంటూ ఉంటారు. త్రివిక్రమ్ కు దక్కిన గౌరవంగా అంతా అనుకుంటున్నారు. కాని మాటల మాంత్రికుడు అంటూ తనను పిలవడం అస్సలు నచ్చదు అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ పేర్కొన్నాడు.
మీరు మాటల మాంత్రికుడు అండీ, మీ పంచ్ డైలాగ్స్ అదిరి పోతాయండి అంటూ నా ముందుకు వచ్చి అనే వారి అంటే నాకు కోపం. వారిని నేను శత్రువులుగా చూస్తాను అంటూ త్రివిక్రమ్ పేర్కొన్నాడు. ‘నువ్వే కావాలి’ సమయంలో ప్రాస కోసం డైలాగ్స్ ను విభిన్నంగా రాసేవాడిని, ఆ తర్వాత ఎంతో మంది అలా రాయడం మొదలు పెట్టారు. దాంతో నేను అలా రాయడం మానేశాను. అప్పటి నుండి కూడా నన్ను అలాగే అంటున్నారు. నా ఆలోచలను డైలాగ్స్ రూపంలో పెట్టాను. థాట్ స్టేట్ మెంట్స్ లా డైలాగ్స్ రాసినప్పుడు ఎవరు వాటిని కాపీ కొట్టలేరని త్రివిక్రమ్ అభిప్రాయ పడ్డాడు.
డైలాగ్స్ లో పంచ్ ఉండాలని నేను ఎప్పుడు రాయను - అసలు నాకు పంచ్ డైలాగ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. సన్నివేశంకు తగ్గట్లుగా రియాక్షన్ ఉండేలా డైలాగ్స్ రాస్తూ ఉంటాను. వాటిని పంచ్ డైలాగ్స్ అని ఎలా అంటారో నాకు తెలియడం లేదు. అసలు పంచ్ డైలాగ్ అనే పదం ఎలా మొదలైందో అంటూ త్రివిక్రమ్ విసుక్కున్నాడు. ఇన్నాళ్లు త్రివిక్రమ్ పై అభిమానంతో ఆయన్ను మాటల మాంత్రికుడు అంటూ సంభోదిచిన వారు, ఆ మాట ఆయనకు ఇష్టం లేదు కనుక ఇకపై ఆ మాటను మర్చి పోతారేమో చూడాలి.